ఎదులాపురం, ఫిబ్రవరి 22 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, బీసీ, ఎస్టీ గురుకులా ల్లో ఐదో తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఈ నెల 23వ తేదీన నిర్వహించే ప్రవే శ పరీక్షకు అన్ని ఏర్పాటు చేశామని డీసీవో జిల్లా కో-ఆర్డినేటర్ లలిత కుమారి తెలిపా రు. శనివారం సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో నంబర్లు వేయించారు.
ఈ సందర్భంగా డీసీవో జిల్లా కో-ఆర్డినేటర్ మాట్లాడుతూ.. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఐదో తరగతిలో ప్రవేశానికి, అ లాగే 6,7,8,9 వ తరగతుల్లో బ్యాక్లాగ్ సీ ట్ల కోసం ఆదివారం ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 4,193 మం ది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా.. పది కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందన్నారు. పరీక్ష రాసే విద్యార్థులు హాల్‌టికెట్‌తోపాటు ఆధార్ కార్డు తీసుకుని రావాలన్నారు. ఒకవెళ ఆధార్ కార్డులో పేర్లు తప్పుగా ఉంటే బొనిఫైడ్ జిరాక్స్ తీసుకుని వస్తే కేంద్రంలోకి అనుమతి ఉంటుందన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి వచ్చే సమయంలో ఫ్యాడ్, బ్లూ, బ్లాక్ పెన్స్, హాల్ టికెట్, ఆధార్ కార్డు తప్పని సరిగా తీసుకునిరావాలన్నారు.