సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక తెలంగాణ మహిళ. కట్టు.. బొట్టు.. బోనంతో సంస్కృతికే వన్నె తెచ్చిందామె. మహిళ జీవితం చుట్టూపెనవేసుకున్న వేడుకలే కేంద్ర బిందువుగా ఫొటోగ్రఫీ ప్రాజెక్ట్ చేశాడు కొత్తగూడెం యువకుడు పవన్ బింగి. వరంగల్, భద్రాచలం, వేములవాడ, ములుగు, వికారాబాద్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో పర్యటించి అక్కడి జన జీవనాన్ని కెమెరాలో బంధించాడు. వీటన్నిటినీ ఒకేచోట చేర్చి రవీంద్రభారతిలో ‘వ్యూ ఫైండర్’ పేరుతో ఛాయాచిత్ర ప్రదర్శన నిర్వ హిస్తున్నాడు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఏర్పాటైన ఈ ఎగ్జిబిషన్ ఆగస్టు 12 వరకు కొనసాగుతుంది.