‘ఇదొక గర్వించాల్సిన క్షణం. అమ్మాయిలు తమకు ఇష్టమైన ఆటలో రాటుదేలేలా ఒలింపిక్స్ విజయం తప్పక ప్రేరేపిస్తుంది. ప్రతి క్రీడలోనూ మహిళలు అత్యుత్తమ ప్రదర్శన కన
బర్చారు. దేశానికి పతకాలు తెచ్చారు. ఇదీ మన సత్తా’ అంటూ నటి రకుల్ ప్రీత్‌సింగ్ ఒలింపిక్స్‌లో నారీ విజయాన్ని సామాజిక మాధ్యమాల్లో కొనియాడింది. గోల్ఫ్ క్రీడాకారిణి అయిన రకుల్‌కు ఫిట్నెస్ అంటే అమితాసక్తి. గోల్ఫ్‌లో జాతీయ స్థాయిలో ప్రతిభ చూపింది కూడా. హైదరాబాద్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్‌కు సహ యజమానిగా వ్యవహరిస్తున్నది రకుల్. మహిళలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక స్పోర్ట్స్ కౌన్సెలింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నదీ బాలీవుడ్ భామ.