ఆధునిక మహిళలు సంప్రదాయాన్ని మేళవించిన ఫ్యాషన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి వారికిమగ్గం వర్క్ జతచేసిన బాందిని లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ అతికినట్టు సరిపోతుంది.
ఎర్రమందారం
సందర్భం ఏదైనా ఎరుపు రంగు దుస్తుల్లో మెరిసిపోవచ్చు. అందరినీ ఆకర్షించే ఎర్రని ఎరుపుపై గ్రీన్ అండ్ ఎల్లో బాందిని ప్రింట్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన ఫ్రాక్ ఇది. నెక్‌లైన్‌లో గ్రీన్-ఎల్లో కలర్ త్రెడ్‌తో మగ్గం వర్క్ చేశారు. రౌండ్ నెక్కు డిటాచబుల్ మిర్రర్ బెల్ట్ జతచేశారు. దీంతో బాడీపార్ట్ హైలైట్ అయ్యింది. అదేరంగు ఫ్యాబ్రిక్‌తో షార్ట్ పఫ్ హ్యాండ్స్ ఇవ్వడం బాగుంది. లైనింగ్కూ ఆ వర్ణాన్నే ఎంచుకున్నారు. వేవ్లుక్ కోసం బాటమ్‌కు పైపింగ్ చేశారు. మిర్రర్ వర్క్ బెల్ట్ అదనపు ఆకర్షణ.
పచ్చని చిలుకలా
చిలుకపచ్చ.. మగువలు మెచ్చే రంగు. లైట్‌గ్రీన్ షిఫాన్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. గ్రీన్‌పై హైలైట్ అయ్యేలా వైట్ కలర్ బాందిని ప్రింట్ చేశారు. వీ షేప్ నెక్ ఇచ్చి నెక్‌లైన్‌కు ముత్యాలు, ఆకుపచ్చ కుందన్స్‌తో వర్క్ చేశారు. టాప్, బాటమ్ పార్ట్స్‌ను వేరుచేస్తూ కుందన్వర్క్తోనే ఇన్వర్టెడ్ వీ షేప్ ఇచ్చారు. అంతేకాదు, ఎల్బో లెన్త్‌లో పఫ్ హ్యాండ్స్ జతచేశారు. సేమ్ కలర్ కాటన్ ఫ్యాబ్రిక్‌తో లైనింగ్ ఇచ్చారు.
రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్ follow us on: instagram.com/
riteshareddy, 70136 39335