హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా యూత్‌లో క్రేజ్ ఉన్న నటుడు విజయ్ దేవరకొండ. ఇందుకు కారణం తన కేర్లెస్ యాటిట్యూడే అంటారు చాలామంది. ‘రౌడీ బాయ్స్’ ట్రెండ్‌తో యూత్ ఐకాన్‌గా మారిన విజయ్ తాజాగా ఆడియో బ్రాండ్ ‘ఫైర్-బోల్ట్’కు ప్రచారకర్తగా ఎంపికయ్యాడు. ‘లైగర్’ సినిమా పరాజయం తర్వాత కూడా ఇలాంటి మెగా ఆఫర్ విజయ్‌ని పలకరించడం అతని ఇమేజ్ చెక్కుచెదరలేదని నిరూపిస్తున్నది. క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటులు విక్కీ కౌశల్, కియారా అడ్వాణీతో కలిసి ‘ఫైర్-బోల్ట్’ ప్రకటనల్లో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు విజయ్. తనకున్న పాన్ ఇండియా ఫాలోయింగ్ తమ బ్రాండ్ ఇమేజ్ను పెంచితీరుతుందని
ఫైర్-బోల్ట్ విశ్వసిస్తున్నది.