పచ్చని ప్రకృతి అన్నా, రంగురంగుల పూవులన్నా ప్రాణమిస్తారు స్త్రీలు. నగలు, అలంకరణల్లోనూ పూల ఇతివృత్తాలే ఎక్కువ. ఇక ఫ్యాబ్రిక్అయితే ఫ్లోరల్ ప్రింట్ అందమే వేరు. ఈతరం అమ్మాయిలకు నప్పేలా ఫ్లోరల్ ప్రింటెడ్ లాంగ్‌ఫ్రాక్ కలెక్షన్ మీకోసం..
ఆరెంజ్ మెరుపుతో..
నిండుగా కనిపించే వర్ణం ఆరెంజ్. ఆ రంగు షిఫాన్ ఫ్యాబ్రిక్ మీద సెల్ఫ్ ఫ్లోరల్ ప్రింట్ ఉన్న ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన లాంగ్ ఫ్రాక్ ఇది.
నెక్లైన్ రౌండ్ నెక్ ఇచ్చారు. జర్దోసి మగ్గం వర్క్ హైలైట్ అయ్యింది. రౌండ్ నెక్ చుట్టూ హ్యాండ్స్ ఫుల్ స్లీవ్స్ ఇచ్చి చివరన ఆరెంజ్ కలర్లో డార్క్ షేడ్ రాసిల్క్‌తో పట్టీలు ఇచ్చారు. గోల్డ్స్టోన్తో ప్రత్యేకమైన వర్క్ బావుంది. గోల్డ్ లేస్ బార్డర్ ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. బెల్ట్ అదనపు అందం తెచ్చింది.
మోడల్: పావని
గులాబి బాల
అతివల ప్రియ పుష్పం.. గులాబి. ఎవర్గ్రీన్ పింక్ కలర్ ఫ్యాబ్రిక్‌పై మల్టిపుల్ కలర్స్ ఉన్న ఫ్లోరల్ ప్రింట్ చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన లాంగ్‌ఫ్రాక్ ఇది. యోక్ పార్ట్ కోసం ఫ్రంట్ రౌండ్ నెక్ ఇచ్చి ప్రిన్సెస్ లైన్‌తో హైలైట్ చేశారు. నెక్లైన్, హ్యాండ్స్ దగ్గర మిర్రర్ వర్క్ బాగుంది. హ్యాండ్స్.. ప్లీటెడ్ పఫ్ హ్యాండ్స్ ఇచ్చి మగ్గం వర్క్‌తో బార్డర్ రూపొందించారు. డబుల్ గేరాతో బయస్ కట్లో ఇచ్చిన బాటమ్ ఫుల్ బౌన్సీ లుక్
అదిరిపోయింది.
మోడల్: ధ్రువిక
రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్ follow us on: instagram.com/
riteshareddy, 70136 39335