పితృ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు జీ తెలుగు చానల్ ప్రత్యేక కార్యక్రమాలతో అలరించనుంది. ఫాదర్స్ డేతోపాటు వరల్డ్ మ్యూజిక్ డే సంబరాలకు.. సాయంత్రం 6 గంటలకు తెర తీయనుంది. ‘థ్యాంక్ యూ దిల్ సే’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో ‘విరాట పర్వం’ నాయికా
నాయకులు రానా, సాయిపల్లవి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ‘పక్కా కమర్షియల్’ జంట గోపీచంద్, రాశీ ఖన్నా వేడుకలో వేదిక పంచుకోనున్నారు. ‘చోర్ బజార్’ ఫేమ్ ఆకాశ్ పూరి, గెహెనా సిప్పి జంట కూడా దిల్ సే సెలబ్రేషన్స్‌లో పాలుపంచుకోనున్నారు. ఆటలు, పాటలు, స్కిట్స్‌తో ఆద్యంతం ప్రేక్షకులను అలరించనున్నారు. మొత్తానికి రెండు ప్రత్యేక సందర్భాలను కలగలుపుకొన్న ఈ ఆదివారాన్ని మరెన్నో సంతోషాలకు కేరాఫ్‌గా నిలపనుంది జీ తెలుగు.