బ్యూటీ చిట్కాలు.. ఊరించే వంటలు.. ట్రెండీ ఫ్యాషన్ వీడియోలతో యూట్యూబ్ కంటెంట్ మీరూ చేస్తున్నారా? అయితే, షార్ట్‌టైమ్‌లో ఆడియన్స్ కనెక్ట్ అయ్యేందుకు ‘షాట్స్’ని మరింత భిన్నంగా ప్లాన్ చేయొచ్చు. ఇకపై యూట్యూబ్ షాట్స్ నిడివిని.. ఇన్స్టాగ్రామ్ రీల్స్ మాదిరిగా పెంచొచ్చు. అందుకు తగిన ఫీచర్‌ని ప్రత్యేక టెంప్లెట్లా అందించేందుకు సిద్ధమైంది యూట్యూబ్. ఈ టెంప్లెట్తో నయా ైస్టెల్స్‌తో షాట్స్‌ని రూపొందించొచ్చు.
నిమిషాల షాట్స్‌ను యూజర్లు అప్లోడ్ చేసే ఫెసిలిటీ అమల్లోకి రానుంది. ఇతరులు ట్రెండింగ్ చేస్తున్న క్లిప్స్ నుంచి ఎడిటింగ్ ైస్టెల్స్, సౌండ్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసేందుకు ఈ షాట్స్ ‘టెంప్లెట్’ టూల్ ఉపయోగపడుతుంది. షాట్స్‌ని ఎడిట్ చేసేందుకు ఇదో సింపుల్ ప్రాసెస్ అన్నమాట. షాట్స్‌లో లాంగ్ వీడియోలను పెట్టుకునే వెసులుబాటు కల్పించాలని యూజర్ల నుంచి అభ్యర్థనలు రావడంతో యూట్యూబ్ ఈ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొస్తున్నది. అంతేకాదు.. ఇన్‌స్టాకు దీటుగా యూజర్లు కంటెంట్ క్రియేట్ చేసుకునేలా నయా ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నది.