చలికాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది. ఆకలి సరిగ్గా వేయదు. దీని వల్ల పొట్టకు సంబంధించి ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే వెచ్చటి నీళ్లు, పానీయాలు, ఆహారంలాంటివి తీసుకోవడం ద్వారా వాటిని సరిచేసుకోవచ్చు అని చెబుతున్నది ఆయుర్వేదం. ఈ సీజన్లో దొరికే ఆహారం తీసుకోవడం ద్వారా కూడా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చనీ అంటున్నది.