HomeZindagiWhat Should A Husband And Wife Do If Their Relationship Is Mutual
కలిసి నడుద్దాం!
ఆలూమగలు సగం సగం. వాళ్ల అడుగులు వేరైనా.. నడక ఒకటిగా సాగాలంటే ఇద్దరూ కొన్ని విషయాల్లో స్పష్టంగా ఉండాలి. కొన్ని విషయాల్లో అతిగా స్పందించకుండా ఉండాలి. అప్పుడే మీది నిండు సంసారం అనిపించుకుంటుంది. చిరాకులు, పరాకుల వేళ ఒకరిపై ఒకరు కురిపించుకునే అభిమానం వైవాహిక బంధాన్ని బలపరుస్తుంది.

భాగస్వామి అన్నివేళలా అందుబాటులో ఉండాలనుకోవడం సరికాదు. రోజంతా కొంగుపట్టుకొని తిరగాలని భావించొద్దు. అలా కుదరకపోతే.. అదే పనిగా అలకపాన్పును ఆశ్రయించొద్దు. ఈ సూత్రం ఆలూమగలిద్దరికీ వర్తిస్తుంది.
భార్యాభర్తల మధ్య సందేశాల పరంపర కొనసాగడం సహజం. కానీ, పార్ట్నర్ నుంచి రిైప్లె వచ్చేలోపే బుంగమూతి ఎమోజీలు పంపొద్దు. ప్రేమను పంచుకోవడానికి టైమ్తో పని లేదనుకోండి! కానీ, పనివేళల్లో సందేశాల జోరు కొత్తలో ముచ్చటగా అనిపించినా.. రోజులు పోయే కొద్దీ విసుగెత్తిస్తుంది. ‘ఎప్పుడెప్పుడు సందేశం వస్తుందా’ అని ఇద్దరూ ఎదురుచూసేలా ఇద్దరి మెసేజ్ మంతనాలు సాగాలి.
దాంపత్యంలో దాపరికాలకు తావు ఉండకూడదు. మనసులోని మాట పెదవి దాటకపోతే సంసారంలో సమస్యలు తొంగి చూస్తాయి. లేనిది ఉన్నట్టుగా చెప్తే.. ఒక్కోసారి అసలుకే ఎసరు రావొచ్చు. ఉన్నది ఉన్నట్టుగా, సందర్భోచితంగా, సావకాశంగా పంచుకుంటే.. ఇద్దరి మధ్యా అనుబంధం ఆనందంగా పెనవేసుకుంటుంది.
నమ్మకాల పునాదుల మీదే సంసారం ఆధారపడి ఉంటుంది. ఎవరో ఏదో అన్నారని.. ఆరాలు తీయడం, ఇంకేదో ఊహించుకొని దెప్పిపొడవడం లాంటివి చేస్తే సంసారం నరకంగా తయారవుతుంది. గాలి వార్తలను నిర్మొహమాటంగా కొట్టిపారేయండి. మనసులో మారు ఆలోచన లేకుండా మనగలిగితే.. ఇద్దరూ కలిసి సంసార సాగరాన్ని పిల్లకాల్వ ఈదినంత సులువుగా దాటేయొచ్చు.