మొర్రిపండు తిన్న తర్వాత చాలా మంది గింజ పారేస్తారు. కొందరు వీటిని ఎండబెట్టి తర్వాత వాటిని పగులగొట్టి పలుకును తీస్తారు. ఈ పలుకు వృథా పదార్థమేమీ కాదు. ఈ పలుకుల్లో ఖనిజాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పొట్టకు చల్లదనం చేకూర్చుతాయి.
జుట్టును బలోపేతం చేస్తాయి. రెండు టీస్పూన్ల గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయమే తింటే జుట్టు సమస్య నుంచి తొందరగా బయటపడొచ్చు. మొర్రి పలుకుల నూనె రాసుకుంటే జుట్టు కుదుళ్లలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. డ్రైఫ్రూట్స్ మార్కెట్లో ఈ గింజలు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ ద్వారా కూడా పొందవచ్చు.