ఫొటోగ్రఫీకి పెద్దపీట
స్మార్ట్‌ఫోన్ ఫొటోగ్రఫీకి పెద్దపీట వేస్తూ.. వివో అద్భుతమైన ఫ్లాగ్షిప్ మాడల్స్‌ను తీసుకొచ్చింది. ఎక్స్300 అల్ట్రా, ఎక్స్300ఎస్ పేరుతో శక్తిమంతమైన కెమెరా ఫోన్లను తాజాగా, చైనాలో విడుదల చేసింది.
స్మార్ట్‌ఫోన్ ఫొటోగ్రఫీకి పెద్దపీట వేస్తూ.. వివో అద్భుతమైన ఫ్లాగ్షిప్ మాడల్స్‌ను తీసుకొచ్చింది. ఎక్స్300 అల్ట్రా, ఎక్స్300ఎస్ పేరుతో శక్తిమంతమైన కెమెరా ఫోన్లను తాజాగా, చైనాలో విడుదల చేసింది. ఈ రెండు మాడల్స్‌లో డ్యూయల్ 200ఎంపీ సెన్సర్లు ఏర్పాటుచేసింది. వీటి ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఎక్స్300 అల్ట్రాలో వెనుకవైపున ట్రిపుల్ కెమెరా సెటప్ ఏర్పాటు చేశారు. వీటిలో రెండు 200ఎంపీ సెన్సర్లను అమర్చారు. వాటిలో ఒకటి మెయిన్ కెమెరా కాగా.. రెండోది పెరిస్కోప్ జూమ్ షాట్ల కోసం ఉపయోగపడుతుంది.
మరో 50 ఎంపీ సెన్సర్.. అల్ట్రా వైడ్ లెన్స్‌గా పనికొస్తుంది. ముందువైపు సెల్ఫీల కోసం 50ఎంపీ కెమెరాను ఏర్పాటుచేశారు. ఎక్స్300 అల్ట్రాలో 2కె రిజల్యూషన్, 144హెట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.82-అంగుళాల AMOLED డిస్ప్లేను ఏర్పాటుచేశారు. పర్ఫార్మెన్స్‌లోనూ తగ్గేదేలే! అంటున్నది వివో. ఈ సరికొత్త మాడల్‌లో అత్యాధునిక స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ఎలైట్ చిప్‌సెట్‌ను పొందుపరిచింది. దానికి 16జీబీ ర్యామ్ కూడా జతవ్వడంతో.. ల్యాగ్ అనే మాటే వినిపించదు.
ఎలాంటి పని అయినా, స్మూత్‌గా అయిపోతుంది. 1టీబీ స్టోరేజీ దాకా ఆప్షన్స్ ఉండటం వల్ల.. మెమోరీ కోసం ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. ఇక బ్యాటరీ సామర్థ్యం 6,600 ఎంఏహెచ్. 100వాట్స్ వైర్డ్, 40వాట్స్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఇస్తాయి. మన్నిక విషయంలోనూ వివో వెనుకాడలేదు. ఐపీ 68, ఐపీ 69 వాటర్-డస్ట్ రెసిస్టెంట్ ప్రమాణాలకు అనుగుణంగా దీనిని తీర్చిదిద్దింది. మరో మాడల్.. ఎక్స్300ఎస్‌లో 6.78 అంగుళాల 1.5కె రిజల్యూషన్ కలిగిన డిస్ప్లే ఉంటుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 16జీబీ వరకు ర్యామ్, 1టీబీ స్టోరేజ్ కూడా ఉన్నాయి.
కెమెరా విషయానికి వస్తే.. 200 ఎంపీ ప్రధాన సెన్సర్, టెలిఫొటో, అల్ట్రా-వైడ్ కోసం 50ఎంపీ సెన్సర్లను ఏర్పాటుచేశారు. సెల్ఫీ కోసం 50ఎంపీ కెమెరా ఉన్నది. ఎక్స్300ఎస్‌లో 7,100ఎంఏహెచ్ సామర్థ్యంతో పెద్ద బ్యాటరీ ఉంది. కాబట్టి, చార్జింగ్ గురించిన చింత ఉండదు. 90 వాట్స్ వైర్డ్, 40వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. ఐపీ 68, ఐపీ 69 రేటింగ్‌లతో వస్తుంది. రూ.95,000 నుంచి మొదలయ్యే ఈ స్మార్ట్ఫోన్లు.. త్వరలోనే భారత్‌లోనూ విడుదల కానున్నాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

