‘ఆడపిల్లా?’ ‘అవును ఆడపిల్లే!’ ‘అయితే, వేడుక చేసుకుందాం రండి! కానుక ఇస్తాం తీసుకెళ్లండి’ అంటున్నారు వేములవాడ ఏరియా దవాఖాన ( Vemulawada Area Hospital ) వైద్యులు. ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులకు ఉయ్యాలను కానుకగా ఇస్తున్నారు. ఇప్పటికే నలుగురు ఆడపిల్లల తల్లులు వాటిని అందుకున్నారు కూడా. ఇదే కాదు, ఈ దవాఖానలో గర్భిణులకు సాధారణ కాన్పులపై అవగాహన కల్పించడానికి వైద్యులు అనేక కార్యక్రమాలు చేపట్టారు. వ్యాయామం, ఆహారం ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. కాబోయే తల్లులను శారీరకంగా, మానసికంగా సిద్ధం చేస్తున్నారు.
‘మా వంతుగా సాధారణ కాన్పులపై చైతన్యం కల్పిస్తున్నాం. తగిన సూచనలూ ఇస్తున్నాం. సాధారణ కాన్పులతో పాటు మొదటి, రెండో కాన్పులలో ఆడపిల్ల పుట్టినా బహుమతి అందిస్తున్నాం’ అంటున్నారు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహేశ్రావు. ‘మొదటి కాన్పులోనే నాకు ఆడపిల్ల పుట్టింది. కూతురితోపాటు ఉయ్యాలనూ ఇంటికి తీసుకెళ్లాను. ఆడపిల్ల తల్లినైనందుకు గర్వంగా ఉంది’ అంటున్నది బుర్ర ప్రవళిక అనే బాలింత.
కిక్ కోసం ఐఏఎస్ వదిలి.. అడవుల్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు”