యవ్వనంగా కనిపించే చర్మం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. పండుగ వేళ అలాంటి లుక్ కావాలంటే ఓట్స్‌తో దోస్తీ చేస్తే సరి. అందుకోసం మూడు స్పూన్ల ఓట్స్ పొడి, ఒక స్పూన్ పసుపు పొడి, రెండు చుక్కల విటమిన్-ఇ నూనె, ఒక స్పూన్ బాదం నూనె కలిపి మెత్తటి మిశ్రమంలా కలుపుకొని ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. ఇది చర్మం మీది గీతల్ని, ముడతల్ని పోగొట్టి మృదువుగా ఉండేలా చేస్తుంది. ఇందులోని విటమిన్-ఇ చర్మ కణాలను రిపేర్ చేయడానికి ఉపయోగపడితే, పసుపు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.