ఒకప్పుడు ఇంటిని కళ్ల ముందు ఊహించుకుంటే… గదిలో ఓ చోటు లాంతరు వేలాడుతూ కనిపించేది. కానీ కాలంతో పాటు వచ్చిన మార్పుల్లో ఇప్పుడది మాయమైంది. చాలా పాతకాలం నాటి ఇళ్లలో తప్ప మరెక్కడా ఇది కనిపించడం లేదు. ఆ లోటును భర్తీ చేసేలా, నాటి రోజుల్ని గుర్తు చేసేలా సరికొత్తగా ఎలక్ట్రిక్ లాంతర్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ‘లోఫ్రీ క్యాండ్లీ ల్యాంప్’ ఆ కోవలోనిదే.
లాంతరు దీపం తరహాలో బంగారు రంగు కాంతిని వెదజల్లే దీనికి కింది వైపు కిరోసిన్ పోసే డబ్బాలాంటి డిజైనూ ఉంటుంది. పక్కన వెలుతురును పెంచి తగ్గించుకునేందుకు వీలుండేలా నాబ్ కూడా ఉంటుంది. దాంతో హాలు లేదా స్టడీ టేబుల్ దగ్గర అదీ కాదంటే బెడ్‌ల్యాంప్‌గా… విభిన్న కాంతులను ఎంచుకుంటూ నచ్చినట్టు ఉపయోగించుకోవచ్చు. డిజైన్ పరంగా కాస్త ఫ్యాషనబుల్‌గా ఉండే దీన్ని వేలాడదీసుకునేందుకు వీలుగా కడ్డీ కూడా ఉంటుంది. ఇంటికి వింటేజ్ లుక్
రావాలంటే.. ఇలాంటివి ప్రయత్నిస్తే సరి!