మోకాలి శస్త్రకిచికిత్స కారణంగా ప్రస్తుతం విశ్రాంతి మోడ్‌లో ఉన్నారు అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. ఈ కారణంగా ఆయన నటిస్తున్న ‘ఎన్బీకే 111’ షూటింగ్ వాయిదా పడింది. డిసెంబర్లో సినిమాను విడుదల చేయాలనే సంకల్పంతో చిత్రబృందం ఉండగా, అనుకోకుండా జరిగిన ప్రమాదం వల్ల ఈ సినిమా షూటింగ్‌కి బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం బాలకృష్ణ కోలుకునే పనిలో ఉన్నారు.
నిర్మాతకు ఎలాంటి నష్టం రాకూడదనే ఉద్దేశంతో ఆయన రికవరీపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్‌లోనే ఈ సినిమా షూటింగ్ ఏర్పాట్లను కూడా చేసుకోమని దర్శకుడు మలినేని గోపీచంద్‌కి బాలకృష్ణ చెప్పినట్టు తెలిసింది. సెప్టెంబర్‌లో మెయిన్ సీన్స్ పూర్తిచేసి, అక్టోబర్‌లో ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసి, నవంబర్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కేటాయించేలా చిత్రబృందం ప్లాన్ చేసిందట. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్లోనే సినిమా విడుదలయ్యే అవకాశం ఉన్నది. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకటసతీశ్ కిలారు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.