ఏదో రంగులు మార్చడమే తప్ప ఎప్పుడూ ఒకే తరహా నెయిల్ పాలిష్ పెట్టుకుని బోర్ కొడుతుందా… నెయిల్ ఆర్ట్ డిజైన్ల మీదా మోజు పోయిందా… ఇది కాదు ఇంతకు మించి అని ఇంకేదన్నా ప్రయత్నిద్దామని మనసు కోరుకుంటుందా… అయితే ఈ ‘5 డీ బబుల్గమ్ గర్ల్ నెయిల్ స్టిక్కర్ల’ను ప్రయత్నించాల్సిందే.
అమ్మాయి, అబ్బాయి లేదా కార్టూన్ల ముఖాలున్న రంగు రంగుల స్టిక్కర్ల మీద నోటి దగ్గర బబుల్ గమ్ బుడగ ఉన్నట్టుగా కనిపిస్తాయివి. 5డీ స్టిక్కర్లనే పేరుకు తగ్గట్టు మన చేతితో పట్టుకుంటే ఈ బుడగను అనుభూతి చెందేలా ఉబ్బెత్తుగా వీటిని రూపుదిద్దారు. రొటీన్‌కు భిన్నంగా, కాస్త ఫంకీగా ఏదైనా కావాలనుకుంటే ఈ మోడల్ స్టిక్కర్లని ట్రై చేయొచ్చు. చూడగానే చిత్రంగా కనిపించే వీటితో ఎదుటి వాళ్ల ముఖం మీదా చిరునవ్వుని తెప్పించొచ్చు!