తేజు అశ్విని.. తమిళ తార. హైదరాబాద్ వైపూ అడుగులేస్తున్నారు. ఈట్ ఫ్యాషన్, డ్రింక్ ఫ్యాషన్, థింక్ ఫ్యాషన్.. తన నినాదం. వస్ర్తాల విషయానికి వచ్చేసరికి ఇండో వెస్ట్రన్కు ఓటేస్తారు.
‘జీవితం, ఫ్యాషన్ రెండూ ఒకటే. ఏదీ పరిపూర్ణం కాదు. వాటికి తగినట్టు మనం మారాలి కానీ, మన కోసం అవి మారిపోవు’ తరహా కామెంట్స్ ఆమెలోని తాత్వికతనూ పరిచయం చేస్తాయి.