డ్రెస్సులకే కాదు చీరలకూ టాజిల్స్ పెట్టుకోవడం నడుస్తున్న ఫ్యాషన్. దుస్తులకు ఫ్యాషనబుల్ లుక్‌ని ఇచ్చే వీటిలో పూసలు, రాళ్లతో చేసి వేలాడేవి కొన్నయితే, దారపు పోగుల్ని కుచ్చులుగా పోసేవి మరికొన్ని. అయితే కోకల విషయంలో టాజిల్స్ కొత్త సొగసులు ఒలికిస్తున్నాయి. చీరల చెంగుతో పాటు, చీరంతా కూడా అక్కడక్కడా ఆప్లిక్ తరహాలో విభిన్నమైన టాజిల్స్ వేలాడేలా వీటిని రూపొందిస్తున్నారు డిజైనర్లు.
కాటన్, ఫ్యాన్సీ చీరల్లో ఎక్కువగా వీటి హవా నడుస్తున్నది. అచ్చం చీర మీద వచ్చిన ఎంబ్రాయిడరీలాగే అవే మోడల్ వర్క్పూలు వేలాడే రకాలతో పాటు, అందులోని రంగుల వస్త్రంతోనే రకరకాల ఆకృతులు చేసి వాటిని చీరంచుకు వేలాడదీసేవీ వీటిలో వస్తున్నాయి. ట్రెడిషనల్ లుక్‌కి కేరాఫ్ అడ్రెస్ అయిన చీరని, ఫ్యాషన్ లుక్‌కి ఐకాన్‌లా మార్చేస్తున్నాయి ఈ తరహా టాజిల్స్. ఇక, కాస్త ట్రెండీ బ్లౌజ్ కూడా జోడయితే ఈవెంట్ ఏదైనా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ మాత్రం మనమే!