బాల్యంలో నేను.. బబ్లీనే!
‘బబ్లీ బౌన్సర్' కథకు నేను బాగా కనెక్ట్ అయ్యాను. స్కూల్‌డేస్‌లో మగరాయుడిలా ఉండేదాన్ని. దాదాలా ఫీలయ్యేదాన్ని. పెద్దయ్యే కొద్దీ స్త్రీత్వం ఆ టామ్‌బాయ్‌ని తొక్కేసింది. సినిమాల్లోకి వచ్చాక ఆడపిల్ల ఎలా నడవాలి, ఎలా కూర్చోవాలి.. ఇలా అన్నీ నేర్చుకోవాల్సి వచ్చింది. ‘బబ్లీ బౌన్సర్'తో నా బాల్యం గుర్తొచ్చింది.
ఈ మిల్కీ బ్యూటీ ‘స్వింగ్ జరా’ అని స్టెప్పేస్తే అందరూ స్వింగ్ అయిపోయారు. బాహుబలిని బాహుబంధాల్లో కట్టేసిన అందం తనది. సినిమాల స్పీడు తగ్గినా నటిగా ఆమె జోరు అలాగే కొనసాగుతున్నది. అడపాదడపా హిందీ చిత్రాల్లో తళుక్కుమంటున్న తమన్నా తాజాగా ఒక బౌన్సర్‌గా ప్రేక్షకులను పలకరించింది. ఆమె నటించిన ‘బబ్లీ బౌన్సర్’ శుక్రవారం ఓటీటీలో విడుదలైంది. ఈ సందర్భంగా తమన్నా పంచుకున్న కొన్ని అనుభవాలు…

‘బబ్లీ బౌన్సర్’ కథకు నేను బాగా కనెక్ట్ అయ్యాను. స్కూల్‌డేస్‌లో మగరాయుడిలా ఉండేదాన్ని. దాదాలా ఫీలయ్యేదాన్ని.
పెద్దయ్యే కొద్దీ స్త్రీత్వం ఆ టామ్‌బాయ్‌ని తొక్కేసింది. సినిమాల్లోకి వచ్చాక ఆడపిల్ల ఎలా నడవాలి, ఎలా కూర్చోవాలి.. ఇలా అన్నీ నేర్చుకోవాల్సి వచ్చింది. ‘బబ్లీ బౌన్సర్’తో నా బాల్యం గుర్తొచ్చింది. అప్పుడు ఎలా ఉండేదాన్నో సినిమాలోనూ అలాగే కనిపించా. ఆ పాత్ర నాకు బాగా నప్పింది అనిపించింది. ఈ తరం ఆడపిల్లలు బౌన్సర్స్‌గా ఉండాలనే ఇష్టపడతారు. కెరీర్ పరంగా గానీ, వ్యక్తిగతంగా గానీ రకరకాల చాలెంజ్‌లు ఎదుర్కోవాలంటే ఆ మాత్రం కఠినంగా ఉండాల్సిందే!
అన్ని రంగాల్లో పురుషాధిక్యత ఉన్నట్లే బౌన్సర్లలోనూ మగవారే ఎక్కువ. నా వరకైతే పబ్లిక్ మీటింగ్‌కు వెళ్తే నా చుట్టూ మహిళా బౌన్సర్లు తప్పకుండా ఉంటారు. ఒక స్త్రీగా నాకు రక్షణగా మహిళా బౌన్సర్లు ఉంటేనే కంఫర్ట్‌గా ఫీలవుతాను. అయితే ఈ రంగంలో మరింత మంది మహిళలు రావాల్సి ఉంది.
చిత్ర దర్శకుడు మధు భండార్కర్ స్త్రీ పాత్రలను చాలా శక్తి మంతంగా చూపిస్తారు. బబ్లీ బౌన్సర్లోనూ నా పాత్రను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. పాత్ర కోసం బుల్లెట్ బండి నడపడం నేర్చుకున్నాను. భాష దగ్గరికి వచ్చేసరికి హర్యాణీ యాసపై పట్టు సాధించాను. హరియాణాకు చెందిన మా వదిన దగ్గర భాష, యాస నేర్చుకున్నా. మా వదిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురుచూసింది.
17 ఏండ్ల కెరీర్లో రకరకాల పాత్రలు పోషించాను. మూస పాత్రలు చేయడం చికాకుగానే అనిపిస్తుంది. అయితే నటన నా వృత్తి, దీన్ని బాగా ఎంజాయ్ చేయాలంటే అడపాదడపా ‘బబ్లీ బౌన్సర్’ వంటి సినిమాల్లో అవకాశం రావాలి. ఇలాంటి విభిన్నమైన పాత్రలు వస్తే నేను వెంటనే ఒప్పుకొంటాను. ఆ పాత్రను కొత్తగా ప్రజెంట్ చేయడానికి నా శక్తిమేరకు ప్రయత్నిస్తాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఏ పాత్ర అయినా పూర్తిగా అర్థం చేసుకుంటేనే సరిగ్గా చేయగలం. అనుకున్నట్టుగా ప్రజెంట్ చేయాలంటే కష్టపడాల్సిందే! బబ్లీ పాత్ర నటిగా నన్ను కొత్త కోణంలో చూపించింది
అనడంలో సందేహం లేదు.
రానున్న రోజుల్లో మరిన్ని వినూత్నమైన పాత్రల్లో కనిపించనున్నాను. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నృత్య ప్రాధాన్యం ఉన్న సినిమా కూడా చేయాలని ఉంది. సున్నితమైన ప్రేమకథలోనూ కనిపించాలని కోరుకుంటున్నా.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

