Beauty Tips | దుస్తుల కోసం మనం చాలా ఖర్చుపెడతాం. అందంగా, ఆకర్షణీయంగా కనిపించేందుకు ఎంతో తాపత్రయపడతాం. మరి లోదుస్తుల సంగతి? అందులోనూ.. బ్రా కనుక సరిగా లేకపోతే మానసిక, శారీరక సమస్యలు ఎదురవుతాయి. బ్రా డిజైనింగ్‌లో చిన్నపాటి తేడా వల్ల అసౌకర్యంతో పాటు, అనారోగ్యం కూడా రావచ్చు. అంతర్జాతీయంగా.. బ్రాలలో 120 రకాలున్నాయి. కానీ మన దేశంలో కేవలం 50-60 వరకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ముంబైకి చెందిన జయశ్రీ గుప్తాను ఈ విషయం ఆలోచింపచేసింది. లోపాలకు అతీతమైన బ్రాలను అందించే లక్ష్యంతో.. స్వయంగా Cazaro Lingerie పేరుతో ఓ బ్రాండ్ స్థాపించారు. దాంతోపాటుగా, సరైన లోదుస్తులు ఎందుకు ధరించాలి, వాటిని ఎలా ఎంచుకోవాలి? అనే విషయమై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. తాను చెప్పే విషయాల్లో