శ్రావణ మాసమంటేనే పండగలు, వేడుకలు. పూజలు, నోములంటూ మహిళలు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతారు. అందులోనూ బంగారు వన్నెలో ధగధగలాడే పట్టుచీరలంటే మరీ మక్కువ. మగువల మదిదోచే పట్టుచీరల డిజైన్లేంటో చూద్దాం..
పచ్చని చిలుకలా..
ఎవర్గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్. ఈ రంగుల కలయికలో ఏ చీరైనా మెరిసిపోతుంది. గ్రీన్ కలర్ పట్టు ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ఈ చీర మొత్తం గోల్డ్ కలర్ జరీతో వర్క్ చేశారు. పింక్ కలర్ బార్డర్ కొట్టొచ్చినట్టు కనిపించేలా గోల్డ్ జరీతో పువ్వులు, తీగలతోపాటు గోపురాల డిజైన్ ఇచ్చారు. బార్డర్‌కు కాంబినేషన్లో కొంగు, బ్లౌజ్ కూడా పింక్ కలర్‌తో డిజైన్ చేశారు. బ్లౌజ్‌కు గోల్డ్ జరీతో బుటీస్ ఇవ్వడంతో సంప్రదాయ సౌందర్యం సాధ్యమైంది.
పైతానీ జతగా..
శుభప్రదమైన పసుపు, కుంకుమ వర్ణాల కాంబినేషన్లో డిజైన్ చేసిన నారాయణపేట్ ప్యూర్ సిల్క్ హ్యాండ్లూమ్ చీర ఇది. గోపురాల ఫినిషింగ్ లైన్‌తో డార్క్ పింక్ కలర్‌పై గోల్డ్ కలర్ జరీతో పైతానీ బార్డర్ జతచేశారు. చీరంతా లైట్ కలర్ బుటీస్ కుమ్మరించారు. కొంగును మల్టీకలర్ త్రెడ్స్‌తో.. చిలుకలు, నెమళ్లు, ఆకులు, పువ్వులతో డిజైన్ చేశారు. బార్డర్‌కు కాంట్రాస్ట్‌గా పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చి బుటీస్, హాఫ్ బుట్టా హ్యాండ్స్ జతచేశారు. నవ వధువులకు బాగా నప్పుతుంది.
– నిహారికా రెడ్డి
నిహారికా డిజైన్ స్టూడియో,
శ్రీవైదికి సిల్క్స్, 8008322377,
follow us on Instagram.com/Niharikareddy.official