నగరాలు, పట్టణాల్లోనేకాదు.. ఇప్పుడు పల్లెల్లోనూ వాషింగ్ మెషిన్లు వచ్చిచేరాయి. దుస్తులు ఉతికే శ్రమను తగ్గించాయి. అయితే, చేతులతో బట్టలు ఉతకడంతో పోలిస్తే.. మెషిన్ సరిగ్గా ఉతకదనీ, వస్ర్తాల మురికిని పూర్తిగా వదిలించదనీ ఫిర్యాదులు వినిపిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో వాషింగ్ మెషిన్ వినియోగించే సమయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే.. మంచి ఫలితాలు రాబట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.