HomeZindagiSkin Problems Even If Pillowcases Are Not Cleaned
మొటిమలకు మంగళం
ముఖ వర్చస్సును దెబ్బతీయడంలో ‘మొటిమలు’ ముందుంటాయి. వీటిని వదలగొట్టుకోవడానికి అమ్మాయిలు నానా అవస్థలు పడుతుంటారు. ఈ చిట్కాలతో మేనిఛాయను మెరుగు పరుచుకోవచ్చని బ్యూటీషియన్లు చెబుతున్నారు.
ముఖ వర్చస్సును దెబ్బతీయడంలో ‘మొటిమలు’ ముందుంటాయి. వీటిని వదలగొట్టుకోవడానికి అమ్మాయిలు నానా అవస్థలు పడుతుంటారు. ఈ చిట్కాలతో మేనిఛాయను మెరుగు పరుచుకోవచ్చని బ్యూటీషియన్లు చెబుతున్నారు.
దిండు కవర్లను శుభ్రం చేయకపోయినా.. మొటిమలు పెరుగుతాయట. చర్మం, జుట్టు కుదుళ్లలో ఉండే జిడ్డు దిండు కవర్ల పైకి చేరుతుంది. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకుండా వాడితే.. ముఖంపై మొటిమలు వస్తాయి. అందుకే, కనీసం వారానికి ఒకసారైనా దిండు కవర్లను మార్చుకోవాలి.
కొందరు అమ్మాయిలు ఫోన్‌ను మొహంపై పెట్టుకొనే మాట్లాడుతుంటారు. అయితే, పబ్లిక్ టాయిలెట్ కన్నా.. మొబైల్ స్క్రీన్‌పైనే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఫోన్ ద్వారా ముఖంపైకి చేరే క్రిములతో మొటిమలు ఎక్కువ అవుతాయి. అలాకాకుండా ఉండాలంటే.. ఫోన్ స్క్రీన్‌ను ఎప్పటికప్పుడు శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.
రాత్రి పడుకునే ముందు, ఉదయం లేవగానే ముఖం శుభ్రంగా కడుక్కుంటే.. మొటిమల బాధ తప్పుతుంది. చెమట ఎక్కువ పట్టినప్పుడూ ముఖాన్ని కడుక్కోవాలి. దీనివల్ల ముఖంపై దుమ్ము, జిడ్డుదనం తొలగిపోతుంది.