డేటింగ్ యాప్స్‌లో స్వైపింగ్ చేసి అలసిపోయారా? ఒక్క నిమిషం ఆగండి.. ఇక మీ మనసుకు నచ్చిన జోడీని ఏఐ వెతికి పెడుతుంది! డేటింగ్లో ఇదో ట్రెండింగ్ అప్డేట్! పార్టనర్ కోసం యాప్‌లలో టెన్షన్ లేకుండా.. చక్కగా ఏఐ మీకు తగిన పార్ట్నర్ని సూచిస్తుంది. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే కలుసుకోవచ్చు. కొత్తగా వచ్చిన సిట్చ్ (Sitch) యాప్‌తో ఇది సాధ్యమే.
ఈ బిజీలైఫ్‌లో డేటింగ్ యాప్‌లో గంటల తరబడి వెతికే తీరిక ఎవరికి ఉంది! ఈ సమస్యకు ఒక కొత్త పరిష్కారం చూపిస్తున్నది సిట్చ్. ఇది ఒక ఏఐ చాట్‌బాట్‌ను ఉపయోగించి మీకు నచ్చిన పార్ట్నర్ని జతచేస్తుంది. ఇందుకోసం యాప్‌లో మొదట మీరు చాట్‌బాట్‌తో మాట్లాడాలి.
మీకు నచ్చిన వ్యక్తిలో ఎలాంటి లక్షణాలు ఉండాలి? మీకు ఏం నచ్చవు? మొదటి డేట్ ఎలా ఉండాలి?… లాంటి ఎన్నో విషయాల్ని చాట్‌బాట్ అడుగుతుంది. వాటికి మీరిచ్చే సమాధానాల ఆధారంగా ఒక ప్రొఫైల్‌ను తయారు చేస్తుంది. అలా రూపొందించిన ప్రొఫైల్‌ని నచ్చిన వాళ్లు మిమ్మల్ని సంప్రదిస్తే.. మళ్లీ మీ కథంతా వారికి చెప్పే అవసరం ఉండదు.
అలాగే, మీరు పిక్ చేసిన ప్రొఫైల్ గురించి కూడా ఆరా తీయాల్సిన పనిరాదు. అయితే, ఏఐ ఆధారిత యాప్‌లకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొన్నిసార్లు ఏఐ తప్పు సమాధానాలు చెప్పొచ్చు. ఫేక్ ప్రొఫైల్స్ సమస్య కూడా ఉంటుంది. అయితే, భవిష్యత్తులో యాప్‌ని మరింత విప్లవాత్మకమైన మార్పులతో అందుబాటులోకి తెస్తామని సిట్చ్ రూపకర్తలు చెబుతున్నారు.