రవీనా.. వయసు ఇరవై అయిదు. అరవై అయిదు మిలియన్ల మంది వీరాభిమానులు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఆమె పాటలు ఆస్వాదిస్తారు.
స్పాటిఫై స్టార్ ఆమె. యూట్యూబ్ సంచలనమూ ఆమే. ఈ ఇండో అమెరికన్ సింగర్ సమాజాన్ని ఇతివృత్తంగా చేసుకుంది. ఆ గొంతుక హింసను గర్హిస్తుంది. వివక్షను ప్రశ్నిస్తుంది. ‘పాట నా ఆయుధం. స్వరాలే నా సైన్యం’ అంటుంది రవీనా.