HomeZindagiSimple Tips To Protect Grains And Rice From Insects Naturally Details
ధాన్యానికి రక్ష కడదాం
వంటింట్లో నిల్వ చేసిన బియ్యం, పప్పులపై పురుగులు, కీటకాలు దాడి చేస్తుంటాయి. నెల దాటక ముందే పాడు చేస్తుంటాయి. వాటిని నివారించడానికి ఏ మందులూ వాడలేని పరిస్థితి.
వంటింట్లో నిల్వ చేసిన బియ్యం, పప్పులపై పురుగులు, కీటకాలు దాడి చేస్తుంటాయి. నెల దాటక ముందే పాడు చేస్తుంటాయి. వాటిని నివారించడానికి ఏ మందులూ వాడలేని పరిస్థితి. అయితే, వంటింట్లో వాడే పదార్థాలతోనే.. ఈ పురుగులు, కీటకాలను తరిమేయొచ్చు.
లవంగాలు, దాల్చినచెక్క.. కీటకాలను దూరంగా తరుముతాయి. బియ్యం, పప్పుల డబ్బాల్లో నాలుగైదు లవంగాలు లేదా చిన్న దాల్చినచెక్క ముక్క వేయండి. వీటిలోంచి వచ్చే ఘాటు వాసనలు.. కీటకాలను తరిమేస్తాయి. ధాన్యాల రుచిని కోల్పోకుండా చూస్తాయి.
సహజసిద్ధమైన పద్ధతిలో కీటకాలను తరిమేయడంలో వేపాకులు ముందుంటాయి. పప్పుధాన్యాలు, బియ్యం నిల్వ చేసే డబ్బాల్లో కొన్ని ఎండిన వేపాకులు వేయండి. ఇవి బొద్దింకలు, చీమలు చొరబడకుండా రక్షణ కల్పిస్తాయి. నెల నెలా ఆకులను మారిస్తే.. మంచి ఫలితం ఉంటుంది.
కీటకాలను దూరంగా ఉంచడంలో ఎండు మిరపకాయలు సమర్థంగా పనిచేస్తాయి. ధాన్యం డబ్బాల్లో రెండుమూడు ఎండు మిరపకాయలు వేస్తే చాలు. వీటి ఘాటైన వాసన.. కీటకాలను నివారిస్తుంది.
కీటకాలు రాకుండా ఉండాలంటే బియ్యం, పప్పులు నిల్వచేసే డబ్బాలు శుభ్రంగా ఉండాలి. వాటిని వాడే ముందు వేడి నీటితో కడిగి, బాగా ఆరబెట్టాలి. ఖాళీ అయిన ప్రతిసారీ శుభ్రం చేస్తూ ఉండాలి. దీంతో కీటకాలు తగ్గుతాయి. ఇక తేమ ఎక్కువగా ఉండే చోట కీటకాలు త్వరగా పెరుగుతాయి. కాబట్టి, బియ్యం, పప్పుల డబ్బాలను పొడి ప్రదేశంలోనే ఉంచాలి.