ఇప్పుడు చాలామందిని ‘గురక’ వేధిస్తున్నది. ఈ సమస్య బాధితులతోపాటు పక్కవారికీ ఇబ్బంది కలిగిస్తుంది. అయితే, కొన్ని వ్యాయామాలు గురకను నివారిస్తాయని నిపుణులు చెబుతున్నారు. గొంతు కండరాలను బలోపేతం చేయడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. గాలి వెళ్లే మార్గాన్ని వెడల్పుగా ఉంచి, నిద్రలో శ్వాస సులభంగా ఆడేలా చేస్తాయని అంటున్నారు.