వర్షాకాలంలో ఆహార సంబంధిత ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. వైద్యులు హెచ్చరిస్తున్న సమస్యల్లో ఫుడ్ పాయిజనింగ్ ఒకటి. బయట తినే ఆహారమే కాదు… ఇంట్లో నిల్వ చేసిన వంటకాలు, సరిగా కడగని కూరగాయలు, కలుషిత నీరు కూడా దీనికి కారణం. వర్షాకాలంలో బ్యాక్టీరియా, వైరస్లు వేగంగా వ్యాపిస్తాయి. కాబట్టి, ఆహారాన్ని ఎక్కువసేపు బయట ఉంచకూడదు.
కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి లక్షణాలను చిన్నగా తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, మధుమేహం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వేడి ఆహారం తినడం, తాగునీటిని మరిగించి లేదా ఫిల్టర్ చేసి వాడాలి. పండ్లు-కూరగాయలను బాగా కడిగి తీసుకోవడం, మిగిలిన ఆహారాన్ని వెంటనే ఫ్రిజ్లో పెట్టేయడం వంటి చిన్న జాగ్రత్తలు పెద్ద సమస్యలను దూరం చేస్తాయి.