ఉక్రెయిన్లో నౌకపై దాడి నలుగురు భారతీయులు మృతి.. మరొకరి పరిస్థితి విషమం
ఉక్రెయిన్లో నౌకపై జరిగిన దాడిలో నలుగురు భారతీయులు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. జూలై 19న సాయంత్రం ఒడెసా పోర్టు నుంచి ఐదుగురు భారతీయులతో సహా 17మందితో గినియా-బిస్సావు జెండా కలిగిన ఎంవీ గోల్డెన్ నౌక ధాన్యం తీసుకెళ్తుండగా దాడి జరిగింది.
న్యూఢిల్లీ : ఉక్రెయిన్లో నౌకపై జరిగిన దాడిలో నలుగురు భారతీయులు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. జూలై 19న సాయంత్రం ఒడెసా పోర్టు నుంచి ఐదుగురు భారతీయులతో సహా 17మందితో గినియా-బిస్సావు జెండా కలిగిన ఎంవీ గోల్డెన్ నౌక ధాన్యం తీసుకెళ్తుండగా దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు భారతీయులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఉక్రెయిన్లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారని విదేశాంగశాఖ తెలిపింది.
పరిస్థితిని ఉక్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ నిశితంగా పరిశీలిస్తోందని చెప్పింది. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు విదేశాంగశాఖ నోట్ విడుదల చేసింది. నోట్లో రష్యా పేరు విదేశాంగశాఖ ప్రస్తావించలేదు. ఉక్రెయిన్ మాత్రం రష్యానే దాడి చేసిందని ఆరోపించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

