‘కళ’కు భాషాభేదాలు ఉండవని అంటున్నది సీనియర్ నటి శిల్పా శెట్టి. ప్రస్తుతం అన్ని భాషల చిత్రాలు.. ఇతర భారతీయ భాషల్లోకి అనువాదం అవుతున్నాయని చెప్పుకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. నిన్నమొన్నటి దాకా తమిళనాడు, కర్ణాటకల్లోనే కనిపించిన భాషాభిమానం.. ఇప్పుడు మహారాష్ట్రకూ పాకింది. ఈ క్రమంలో ‘మరాఠీ భాషా వివాదం’పై శిల్పాశెట్టి స్పందించింది. తన రాబోయే చిత్రం ‘కేడీ: ది డెవిల్’ ప్రమోషనల్లో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నది శిల్ప. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మరాఠీ భాషా చిత్రాల గురించి ప్రశ్నలు అడిగారు.
వాటికి సమాధానం ఇస్తూ.. తానెప్పుడూ వివాదాలకు దూరంగానే ఉన్నాననీ, ఇప్పుడు కూడా ఎలాంటి వివాదానికి ఆజ్యం పోయాలని అనుకోవడం లేదనీ చెప్పుకొచ్చింది. “నేను మహారాష్ట్ర అమ్మాయినే. ముంబయిలోనే ఉంటూ, ఇక్కడే సినిమాలు చేస్తున్నా. అయినా.. మరాఠీ భాషా, ఇతర వివాదాస్పద విషయాల గురించి మాట్లాడే సమయం కాదు. మా సినిమా బహుభాషా చిత్రం. ఇప్పుడు అన్ని భాషల సినిమాలు.. ఇతర భాషల్లోకి డబ్ అవుతున్నాయి. మా సినిమానూ మరాఠీలోకి డబ్ చేసే అవకాశం కూడా ఉన్నది” అంటూ వెల్లడించింది.
1993లో వచ్చిన థ్రిల్లర్ మూవీ ‘బాజీగర్’తో చిత్రసీమలోకి అడుగుపెట్టింది శిల్ప. తొలి సినిమాలోనే షారుక్ ఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నది. ఆ తర్వాత ‘మై ఖిలాడి తు అనాడి’, ‘జాన్వర్’ లాంటి యాక్షన్ చిత్రాలతో మెప్పించింది. అనేక విజయవంతమైన చిత్రాలతో బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగులోనూ టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించింది. కన్నడ నటుడు ధ్రువ సర్జా హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కేడీ: ది డెవిల్’. రేష్మ నానయ్య హీరోయిన్ కాగా, శిల్పాశెట్టి, సంజయ్ దత్, రమేశ్ అరవింద్ ప్రధాన పాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం..
విడుదలకు సిద్ధంగా ఉన్నది.
‘హౌజ్‌ఫుల్’ బోర్డు పెట్టి.. అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చిందీ చిత్రం. 1990లో చిట్టి జయపురం అనే గ్రామంలో మొదలవుతుందీ కథ. ఈ గ్రామంలో ఎవరు చనిపోయినా.. ఖననం చేసి, సమాధి నిర్మిస్తారు. చిన్నా (సుహాస్) కాటికాపరిగా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ‘శ్మశాన వాటిక’లో స్థలం నిండిపోతుంది. దాంతో ఊరిపెద్ద అపూర్వ (కీర్తి సురేశ్)కు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? శ్మశానంలో నలుగురికి మాత్రమే చోటు మిగిలి ఉన్నదని తెలిసిన ఊరి ప్రజలు ఏం చేశారు? గ్రామపెద్ద పదవి నుంచి అపూర్వ ఎందుకు తప్పుకోవాల్సి వస్తుంది? ఊరికి సమస్యగా మారిన శ్మశాన వాటిక అంశానికి పరిష్కారం దొరికిందా? అనే ప్రశ్నలకు సమాధానమే.. ఉప్పు కప్పురంబు.