వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు సహజం. గాలిలో తేమ శాతం అధికంగా ఉండడం వల్ల ఎలాంటి వైరస్లు అయినా బలంగా, వేగంగా విస్తరిస్తాయి. అందుకని ముఖానికి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. ఈ జాగ్రత్తల వల్ల ఒక్క కరోనా నుంచే కాకుండా ఇన్ఫ్లూయెంజా, ఆర్ఎస్వి తదితర సీజనల్ వైరస్ల నుంచి కూడా తప్పించుకోవచ్చు.