Luxury wallets | అమెరికాకు చెందిన మిషెలా పనెరో అభిరుచి ఉన్న డిజైనర్. న్యూయార్క్‌లోని ఓ కార్పొరేట్ సంస్థలో ఆకర్షణీయమైన కెరీర్ నిర్మించుకున్నారు. ఓసారి మిషెలా ఏదో పార్టీకి తయారవుతున్నారు. కానీ, ఆ సందర్భానికి తగిన పర్స్ ఏదీ కనిపించలేదు. మార్కెట్లో వెతికినా దొరకలేదు. దాంతో తానే ఓ పర్సు తయారుచేసుకున్నారు.
అది అందరికీ నచ్చేయడంతో… ‘రొసంటికా’ బ్రాండ్‌ను స్థాపించి బ్యాగ్‌లు, నగలు రూపొందిస్తున్నారు. 15 ఏళ్లుగా రొసంటికా ఓ లగ్జరీ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. చూసే దృశ్యాలు, ప్రయాణించే ప్రదేశాలు, చుట్టూ ఉన్న ప్రకృతి… అన్నింటినీ ప్రేరణగా తీసుకుని తన ఉత్పత్తులను డిజైన్ చేస్తానని చెబుతున్నారు మిషెలా. భారతీయులు సైతం ఇష్టపడేలా పర్సులు, ప్రత్యేకించి బ్యాగులు తయారుచేస్తున్నారు. రొసంటికా ఉత్పత్తులు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ధర కాస్త ఎక్కువ. అరవై నాలుగు వేల రూపాయల నుంచి లక్షా పాతికవేల వరకు ఖరీదు చేస్తున్నాయి.