కావలసిన పదార్థాలు
మ్యాక్రోని: ఒక కప్పు, క్యాప్సికమ్: ఒకటి, ఉల్లిగడ్డ: ఒకటి, క్యాబేజీ తురుము: అర కప్పు, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, టమాట ప్యూరీ: అర కప్పు, టమాట సాస్: ఒక టీస్పూన్, రెడ్ చిల్లీ పేస్ట్: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, మోజరిల్లా చీజ్: పావు కప్పు, పాలు: పావు కప్పు, మిరియాల పొడి: పావు టీస్పూన్, వెన్న: మూడు టేబుల్ స్పూన్లు, నిమ్మరసం: ఒక టీస్పూన్, కొత్తిమీర తురుము: కొద్దిగా.
తయారీ విధానం
ముందుగా మ్యాక్రోనీని ఉప్పు, నూనె వేసిన నీళ్లలో పది నిమిషాలు ఉడికించి నీళ్లు వంపేసి.. పైనుంచి చల్లని నీళ్లు పోయాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి వెన్న వేయాలి. అది వేడయ్యాక తురిమిన వెల్లుల్లి, ఉల్లిగడ్డ ముక్కలు జోడించి వేయించాలి. బాగా వేగిన తర్వాత క్యాబేజీ, క్యాప్సికమ్ ముక్కలు వేసి మరో నిమిషం పాటు వేయించాక టమాట ప్యూరీ, టమాట సాస్, రెడ్ చిల్లీ పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు కలపాలి. పాలు, చీజ్ తురుము, ఉడికించిన మ్యాక్రోని, నిమ్మరసం వేసి ఒక నిమిషం పాటు ఎక్కువ మంటపై కలుపుతూ ఉండాలి. పైనుంచి కొత్తిమీర తురుము చల్లుకుంటే రెడ్ హాట్ మ్యాక్రోని సిద్ధం.