Ranga Ranga Vaibhavanga on Zee Telugu | విశ్వంలోని రంగుల కలబోతల కోలాహలమే.. హోలీ. ఈ వేడుకను బుల్లితెరపైనా ఘనంగా నిర్వహించ నుంది జీ తెలుగు. ‘రంగ రంగ వైభవంగా’ పేరుతో ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీనటి కృతిశెట్టి హాజరుకానున్నట్టు జీ వర్గాలు తెలిపాయి. హోస్ట్‌గా ప్రదీప్ మాచిరాజు వ్యవహరిస్తున్నారు. పనిలోపనిగా ప్రదీప్ తుళు భాషలో కృతికి ప్రపోజ్ చేయ నున్నట్టు సమాచారం. ఆ ప్రతిపాదనకు బేబమ్మ ఏమంటారో మరి!