మాస్క్‌తో సమస్యలా?

మాస్క్.. కరోనా నుంచి కాపాడుతుంది. కానీ, మాస్క్ దుష్ప్రభావాల నుంచి చర్మాన్ని కాపాడేదెవరు? ఈ విషయంలో మనకు మనమే రక్ష. గత రెండేండ్ల నుంచి ఫేస్ మాస్క్, శానిటైజర్, గ్లౌజ్ రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. కానీ, గంటల తరబడి ముఖానికి మాస్క్ పెట్టుకోవడంతో చర్మ సమస్యలు అధికంఅవుతున్నాయి. మొటిమలు, దద్దుర్లు, దురద చుట్టుముడుతున్నాయి. అదేపనిగా శానిటైజర్లు వాడటంవల్ల చర్మం పొడిబారిపోతున్నది, గోళ్లకు పగుళ్లు వస్తున్నాయి. రోజూ రాత్రి నిద్రపోయే ముందు చేతులకు, గోళ్లకు, చర్మానికి మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకోవాలి. రెండురోజులకు ఓసారి 50 మిల్లీలీటర్ల రోజ్ వాటర్‌లో ఒక టీ స్పూన్ గ్లిజరిన్ కలిపి, ఆ మిశ్రమాన్ని చేతులకు రాసి అరగంట తర్వాత కడిగేయాలి. మాస్క్ కప్పేసే ప్రాంతంలో మేకప్ వేయకూడదు. మాస్క్ ఎంపికలో కూడా జాగ్రత్త అవసరం. నూలు, సహజమైన పట్టు మాస్క్‌లు మాత్రమే తీసుకోవాలి. దీనివల్ల దురద, మంట వంటి సమస్యలు రావు. హ్యాలు
రోనిక్ యాసిడ్గల మాయిశ్చరైజర్, సీరమ్, క్రీములను రోజుకు రెండుసార్లు చర్మానికి రాయాలి. తాగునీటితో పాటు కొబ్బరినీళ్లు, పండ్లరసాలు, సూప్‌లు, మజ్జిగ, నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకుంటే చర్మం తేమను కోల్పోకుండా ఉంటుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

