అబ్బా! ఈ మాట ఎంత బావుందో కదా! కానీ, దోమలు లేని ఇల్లు ఉండటం సాధ్యమేనా? ఎన్ని పాట్లు పడ్డా.. దోమల బెడద తప్పించుకోవడం సాధ్యం కాదు! రకరకాల స్ప్రేలు, క్యాండిల్స్, క్రీములు ప్రయత్నించినా తాత్కాలిక ఉపశమనం తప్ప.. దోమల దాడి తప్పదు. వీటినుంచి విముక్తి కోసం కీటకాలను చంపే ‘బజ్ గాన్’ అనే డివైజ్ అందుబాటులోకి వచ్చింది. విద్యుత్ వాహనాలు తయారుచేసే కొరియా ఇంజినీర్లు ఈ పరికరాన్ని రూపొందించారు.
థెర్మోటాక్సిస్ టెక్నాలజీతో పనిచేసే ఈ డివైజ్‌లో వెలిగే యూవీ లైట్ దోమలు, కీటకాలను ఆకట్టుకుంటుంది. దోమలు ఇందులోకి దూరితే రెండు నిమిషాల్లో చనిపోతాయి. తెల్లారిన తర్వాత ఓపెన్ చేసి డ్రై బాస్కెట్‌లోని దోమల్ని పారేసి, మళ్లీ వాడుకోవచ్చు. దీని ధర తక్కువే! నిర్వహణ కూడా తేలికే!! ఆన్లైన్ మార్కెట్లో ఇది అందుబాటులో ఉంది. ధర రూ.600 లోపే! కాబట్టి రోజూ వాడే రసాయనాలకు ప్రత్యామ్నాయంగా దీనిని వాడుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ డివైజ్‌ని కిటికీలు, మంచం కింద, టేబుల్ పైనా ఎక్కడైనా పెట్టొచ్చు. దోమలను పట్టేసి.. కులాసాగా నిద్రపోవచ్చు.