పాలకూరను బాగా కడిగి, తరిగి పెట్టుకోవాలి. ఓ పాన్లో నెయ్యివేసి మిరియాలు, జీలకర్ర, తరిగిన పచ్చి మిర్చి వేసి వేయించాలి. ఆ తరువాత పాలకూర కూడా వేసి, రెండు నిమిషాలు వేగాక దించి చల్లారనివ్వాలి. కొబ్బరి తురుము, ఉప్పు, కరివేపాకు, పాలకూర మిశ్రమం వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని ఓ గిన్నెలో వేసి, పెరుగు కలిపి పోపు పెడితే సరి. పాలక్ రైతా రెడీ.