పార్శోత్తాసనం కాన్పు తేలిక

తన కడుపు పండిందని తెలియగానే ఆడకూతురుకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఆ క్షణం నుంచి తన గురించి, కడుపులోని బిడ్డ గురించి తహతహలాడుతుంటుంది. కానీ, కాన్పు గండం ఎలా గడుస్తుందని చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు. కాన్పు తేలికయ్యే మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. ఇందుకోసం యోగాసనాలు ప్రయత్నించొచ్చు. పార్శోత్తాసనం వేయడం వల్ల వెన్నునొప్పి దూరమవ్వడంతో పాటు కాన్పుకూడా తేలికవుతుందని చెబుతున్నారు నిపుణులు. అయితే, వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆసనం ప్రయత్నించాలి.
షరతులు వర్తిస్తాయి
- కండ్లు తిరుగుతున్నట్టుగా ఉన్నప్పుడు ఈ ఆసనం వేయకూడదు. పొట్టలో అసౌకర్యంగా ఉన్నా, వ్జైనా నుంచి రక్తస్రావం అవుతున్నా ఈ ఆసనం ప్రయత్నించకపోవడం మంచిది.
- నిటారుగా తాడాసన స్థితిలో నిల్చోవాలి.
- రెండు చేతులను వీపు వెనుకకు తీసుకొని అరచేతులు ఒక దానిని ఒకటి కలిపి ప్రెస్ చేస్తూ ఉంచాలి. చేతివేళ్లు పైకి చూస్తున్నట్టుగా పెట్టాలి.
- నాలుగు అడుగుల దూరం ఉండేలా రెండుకాళ్లను చాపాలి. రెండు పాదాలూ కుడివైపునకు తిప్పాలి. నడుం పైభాగాన్ని నెమ్మదిగా కుడివైపునకు తిప్పాలి.
- రెండు అరచేతులను ప్రెస్ చేస్తూ మోచేతులు వెనక్కి బెండ్ అయ్యేలా జాగ్రత్త పడాలి. ఈ సమయంలో ఛాతీ భాగం పట్టేసినట్టుగా ఉంచకుండా నిదానంగా శ్వాస తీసుకుంటూ ఎక్స్పాండ్ చేయాలి.
- నడుం పైభాగాన్ని కుడివైపునకు నిదానంగా వంచాలి. తల, ఛాతీ, కడుపు భూమికి సమాంతరంగా వంచడం వల్ల పొట్టపై ఎలాంటి ఒత్తిడీ ఉండదు. వెన్నెముకనుంచి మెడవరకు సరైన పొజిషన్లో ఉండేలా జాగ్రత్త పడాలి.
- ఇదే భంగిమలో 20 నుంచి 30 సెకన్లుండాలి. ఈ సమయంలో శ్వాస నిదానంగా తీసుకోవాలి.
- మళ్లీ యథాతథ స్థితికి వచ్చి ఎడమవైపు ఇదే ఆసనం కొనసాగించాలి.
- పార్శోత్తాసనం వేయడం ద్వారా వెన్నునొప్పి దూరం అవుతుంది. ఒంట్లో పెడసరతనం (బిర్రుతనం) తగ్గుతుంది. కాన్పు తేలికగా
- అవుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

