prasarita padottanasana | గర్బిణులు ఈ యోగాసనం వేస్తే ఇంత లాభమా?
prasarita padottanasana | గర్భిణులను మానసిక ఒత్తిళ్లు, శారీరక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. వాటినుంచి ఉపశమనం పొందడానికి యోగ సాధన మంచి మార్గం. ప్రసారిత పాద ఉత్థాన ఆసనం వేయడం ద్వారా మెదడుపై ఒత్తిడి తగ్గుతుంది. శారీరక బలం కలుగుతుంది. ఈ ఆసనం ఎలా వేయాలంటే..
♦ ముందుగా రెండు కాళ్ల మధ్య అడుగున్నర దూరం ఉండేలా నిలబడాలి.
♦ తర్వాత రెండు చేతులను నడుము మీద ఉంచాలి. ఊపిరి తీసుకుంటూ చేతులను నిదానంగా ముందుకు చాపాలి. రెండు భుజాలు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి.
♦ ఇప్పుడు శ్వాస వదులుతూ చిత్రంలో చూపించిన విధంగా నడుమును ముందుకు వంచాలి. రెండు అరచేతులను నేలకు ఆనించాలి. తర్వాత కాళ్ల మధ్య దూరం మరికాస్త పెంచాలి. ఈ ఆసన స్థితిలో 20 సెకండ్లు ఉండి, నిదానంగా శ్వాసక్రియ కొనసాగించాలి.
♦ చివరగా చేతుల మద్దతుతో కాళ్లను దగ్గరికి జరపాలి. నెమ్మదిగా పైకి లేచి పూర్వస్థితికి రావాలి.
ప్రయోజనాలు: మెదడుపై ఒత్తిడిని తగ్గిస్తుంది. తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పొత్తి కడుపు దగ్గర శరీర అంతరభాగాలకు సత్తువనిస్తుంది.
చేయకూడనివారు: కండ్లు తిరుగుతున్న వాళ్లు ఈ ఆసనం చేయకూడదు. వ్జైనా నుంచి రక్తస్రావం అవుతున్నా, వాంతులు అవుతున్నట్లు అనిపించినా ప్రయత్నించొద్దు. డాక్టర్ సలహా తర్వాతే ఆసనం ప్రయత్నించాలి.
– అనితా అత్యాల, ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు, 6309800109
Read More :
గర్భిణులకు మేలు చేసే వజ్రపార్శ్వ కోణాసనం ఎలా వేయాలి?”
“సుప్త వజ్రాసనం | రక్తప్రసరణ పెరిగేందుకు ఈ ఆసనం ఎంతో మేలు చేస్తుంది”
ఊర్ధ వజ్రాసనం | గర్భిణులు ఇలా చేస్తే వెన్నునొప్పి తగ్గిపోతుంది”
వీరాసనం | కాన్పు తర్వాత ఈ ఆసనాలు వేస్తే ఎన్నో లాభాలు”
అర్ధ ఉత్తానాసనం : గర్భిణులు ఈ ఆసనం వేస్తే ఇన్ని లాభాలా..”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Y.S. Sharmila | ఎన్నికల్లో విజయం ప్రజా తీర్పు కాదు..అధికార మదంతో బలవంతపు గెలుపు : వైఎస్ షర్మిల
పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌పై అవగాహన శిబిరం
AP News | ఏపీలో గెలిచిన మేయర్లు, చైర్పర్సన్ల ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ?
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Talasani Srinivas Yadav | ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ యాదవ్, ఎస్పీ నేతలకు తలసాని స్వాగతం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

