ఆర్.నారాయణ మూర్తి వల్లే సినిమాల్లోకి వచ్చా : అభిషేకం సీరియల్ ఫేమ్ ప్రణయ్
pranay hanumandla | అదృష్టం ఎవరిని, ఎప్పుడు, ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. చదువు కోసం హైదరాబాద్ వచ్చి అనుకోని అవకాశంతో నటుడిగా మారారు ఈ టీవీ ‘అభిషేకం’ సీరియల్ ఫేమ్ ప్రణయ్ హనుమాండ్ల. దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి నటుడిగా గుర్తింపు సాధించారు. తాను వృద్ధిలోకి వస్తూ నలుగురికీ సాయపడటమే లక్ష్యంగా సాగుతున్న హనుమకొండ బిడ్డ ప్రణయ్ హనుమాండ్ల అనుభవాలు ఆయన మాటల్లోనే..

మాది హనుమకొండ. పుట్టింది, పెరిగింది, చదువుకున్నది అంతా అక్కడే. వరంగల్‌లోని గణపతి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చేశా. పీహెచ్డీ చేద్దామని హైదరాబాద్ వచ్చా. నటన గురించి ఏమాత్రం అవగాహన, ఆసక్తి లేదు. ఆడిషన్స్‌కీ వెళ్లింది లేదు. ఊహించని విధంగా సినిమా అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది.
నమ్మలేకపోయా..
ఒకరోజు ప్రసాద్ ల్యాబ్స్ దగ్గర ఆర్.నారాయణ మూర్తిగారు నన్ను చూసి ‘సినిమాలో చేస్తావా?’ అని అడిగారు. వచ్చిన అవకాశం వదులుకోవద్దని అమ్మ ఇచ్చిన సలహాతో సినిమాకి ఓకే చెప్పా. అలా ‘అన్నదాతా సుఖీభవ’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యా. ఆ సినిమా పూర్తయ్యాక ఊరికి వెళ్లిపోయా. ఒకరోజు ఈటీవీ నుంచి ‘సీరియల్ అవకాశం ఉంది చేస్తారా?’ అంటూ ఫోన్ వచ్చింది. అలా 2018లో ‘ఆడదే ఆధారం’ సీరియల్‌తో బుల్లితెరకు పరిచయమయ్యా. అప్పటినుంచి ‘మహాలక్ష్మి’, ‘ప్రతిఘటన’, ‘రుతుగీతం’, ‘రామసక్కని సీత’, ‘చదరంగం’.. ఇలా అన్ని చానళ్లలో వరుస సీరియల్స్ చేశా. ‘తూర్పు-పడమర’లో ప్రధాన పాత్ర పోషించా. ప్రస్తుతం ఈటీవీ
‘అభిషేకం’తోపాటు మాటీవీలో ‘ఎన్నెన్నో జన్మలబంధం’లో నటిస్తున్నా. ‘అభిషేకం’ నన్ను ప్రేక్షకులకు బాగా దగ్గర చేసింది. నాకు తొలి అవకాశం ఇచ్చిన ఆర్. నారాయణ మూర్తిగారికి, ఈటీవీకి ఎప్పటికీ రుణపడి ఉంటా. మంచి కథ, పాత్ర దొరికితే సినిమాల్లో చేయాలని ఉంది.
మరిచిపోలేని సంఘటన..
జెమినీలో ‘మహాలక్ష్మి’ సీరియల్ చేస్తున్న సమయంలో ఒకసారి మచిలీపట్నం వెళ్లాం. అక్కడ ఒక పెద్దావిడ నన్ను గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ‘నువ్వు మారు. అక్కాచెల్లెళ్లని బాధపెట్టకు. నువ్వు మారితే అందరూ సంతోషంగా ఉంటారు’ అని బతిమాలింది. ఆ సీరియల్లో అక్కాచెల్లెళ్లని వేధించే సోదరుడి పాత్ర నాది. ఆమె మాటలు వినగానే నాకూ బాధేసింది. ఒక సీరియల్ క్యారెక్టర్‌ను ఇంతలా సొంతం చేసుకుని ఆదరిస్తున్నారా అనిపించింది. విశాఖకు చెందిన వాణి సొంత చెల్లెలా మాట్లాడుతుంది. చదువు, ఉద్యోగం వంటి తనకు సంబంధించిన ప్రతి విషయం నాతో పంచుకుంటుంది. ఈ మధ్యే తనకు చెప్పకుండా వాళ్లింటికి వెళ్లి సర్ప్రైజ్ చేశా.

ముగ్గురూ నా బలం
అమ్మ పేరు పావని. కాకతీయ మెడికల్ కాలేజీలో ఉద్యోగి. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మే అన్నీ తానై పెంచింది. తనకు హీరోయిన్గా అవకాశం వస్తే తాతగారు ఒప్పుకోలేదట. అందుకే నాకు అవకాశం వచ్చినప్పడు వెళ్లమని ప్రోత్సహించింది. నా భార్య పేరు అనురాధ. మాకు ఒక పాప. పేరు తన్వీ పటేల్. నాకు పల్లెటూరు, వ్యవసాయం అంటే చాలా ఇష్టం. మంచి నటుడిగా పేరు తెచ్చుకుని వ్యవసాయం చేస్తూ పల్లెటూళ్లో స్థిరపడాలనేది నా కోరిక. అమ్మ, భార్య, కూతురు.. ఈ ముగ్గురే నా బలం.
ఏదైనా చేయాలని..
కరోనా సృష్టించిన విలయాన్ని చాలా దగ్గరగా చూశా. అందుకే ఏదైనా చేయాలనుకున్నా. వరంగల్ బస్టాండులో రోజూ 100-200 మందికి భోజనాలు పెట్టడం ప్రారంభించా. స్నేహితులంతా మద్దతిచ్చారు. కొందరు డబ్బులిస్తే మరికొందరు నాతో వచ్చి పనిచేశారు. కాలనీవాసులు కూడా కలిసిరావడంతో ‘శ్రీమాతా సేవా సొసైటీ’ని ఏర్పాటుచేసి దాని ద్వారా సేవలు కొనసాగిస్తున్నాం. గ్రామాలు, బస్తీలు, మురికివాడల్లోని పిల్లలకు మోటివేషన్ క్లాసులు తీసుకునే ఆలోచన ఉంది. త్వరలోనే ప్రారంభిస్తా.
ఆ తొమ్మిది రోజులు
ఏటా దసరా శరన్నవరాత్రుల్లో భవానీ దీక్ష తీసుకుని ఇంట్లోనే ఉంటా. అప్పుడు ఎవరికీ డేట్స్ ఇవ్వను. కాలనీలో అమ్మవారి మంటపం ఏర్పాటు చేసి పూజలు జరిపిస్తాను. నటుడిని కాకముందు ఎలా ఉన్నానో, ఇప్పుడూ అలానే ఉన్నాను. మనిషి విలువ వెనకాల ఉన్న డబ్బులో కాదు వెంట ఉండే వ్యక్తిత్వంలో ఉంటుంది.
.. ✍ ప్రవళిక వేముల
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆస్ట్రేలియా స్థానిక ఎన్నికల్లో గెలిచిన తెలంగాణ ఆడబిడ్డ.. ఆమె విజయ రహస్యమిదే..
gauthami jeji | బొల్లి మచ్చలు ఉన్నాయని కుంగిపోలేదు.. మోడలింగ్‌లో అదరగొడుతుంది..
Keerthi priya | రైతన్నలకు అండగా సూర్యాపేట యువతి.. ఇంతకీ ఆమె ఏం చేస్తోందంటే..
nalli fashions | తాతల నుంచి చేస్తున్న చీరల వ్యాపారానికి ఈమె బ్రాండ్ క్రియేట్ చేసింది
Vijayalakshmi | చదివింది పదో తరగతే కానీ.. చేసేది కోట్ల బిజినెస్
Gray hair | చిన్నవయసులోనే తల నెరిసిన వారికి ఈమె ఓ ఇన్స్పిరేషన్.. ఎందుకంటే?
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

