స్మార్ట్‌ఫోన్ కొనాలంటే? బడ్జెట్ వేసుకోవడం.. రివ్యూలు చదవడం.. రేటింగ్‌లు చూడటం.. అబ్బో పెద్ద ప్రాసెస్!! ఇప్పుడు తరం మారింది. ప్రైస్ గురించి పట్టింపులేదు.. రివ్యూలు, రేటింగ్స్? అబ్బే ఇవేం అక్కర్లేదు. ట్రెండీగా ఉందా? వేగంగా పని చేస్తుందా? కొన్ని రోజులు వాడామా? మళ్లీ ఎక్స్చేంజ్ ఆఫర్లో మార్చేశామా? ఇదీ… ఈతరం వాడకం. అందుకే మొబైల్ తయారీ సంస్థలు కూడా భిన్నమైన మాడల్స్‌తో నిత్యం మార్కెట్లో సందడి చేస్తున్నాయి. దేశీయ కంపెనీ టెక్నో తీసుకొచ్చిన ‘పాప్ 9’ మాడల్ ఈ తరహాదే. దేశంలో తొలిసారి బడ్జెట్ ఫోన్లోకి ‘మీడియా టెక్ జీ650’ ప్రాసెసర్‌ని తీసుకొచ్చిందీ సంస్థ. మల్టీటాస్కింగ్‌కి పెద్దపీట వేస్తూ.. బడ్జెట్ ఫోన్‌ను ఎంటర్టైన్మెంట్ అడ్డాగా తీర్చిదిద్దింది. గేమింగ్, సినిమా ప్రియులకు అందుబాటు ధరలో ఉన్న అద్భుతమిది. డ్యూయల్ స్పీకర్లు, డీటీఎస్ సౌండ్‌తో మ్యూజిక్ మస్తీ చేయొచ్చు. ఇక స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే.. తెర పరిమాణం 6.67 అంగుళాలు. 90Hz రీఫ్రెష్ రేట్‌తో చాలా స్మూత్‌గా కనిపిస్తుంది. ర్యామ్ 6జీబీ. స్టోరేజ్ సామర్థ్యాన్ని 1టీబీ వరకూ పెంచుకోవచ్చు. వెనక డ్యూయల్ కెమెరాలు (13 ఎంపీ) ఉన్నాయి. దీంట్లోని మరో ప్రత్యేకత ఏంటంటే.. బ్యాక్ ప్యానల్ స్కిన్స్‌ని కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. ధరెంతో తెలుసా? రూ.6,499 ఓన్లీ. మరిన్ని వివరాలకు https://l1nq.com/fpqtp