ఉదయం ఇంటి నుంచి ఎంతో ఫ్రెష్‌గా, నీట్‌గా తయారై ఆఫీసుకు వెళ్తారు. కానీ, సీటులో కూర్చున్న రెండు మూడు గంటలకే ముఖం పాలిపోయినట్టుగా లేదా విపరీతమైన జిడ్డుతో కనిపిస్తుందా? జుట్టు డ్రైగా మారిపోయి సెట్టింగ్ అంతా చెదిరిపోతున్నదా? అయితే మీరు
‘ఆఫీస్ ఎయిర్ థియరీ’ బారిన పడ్డట్టే! ప్రస్తుతం ఎఫ్బీ, ఇన్‌స్టాగ్రామ్‌లో వేలమంది ఉద్యోగులు ఈ సమస్యపై తమ గోడును వెళ్లగక్కుతున్నారు. ఇదంతా కేవలం ఊహ కాదు, దీని వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు.
ఆఫీసుల్లో కృత్రిమ వాతావరణం అంటే… నిరంతరం నడిచే ఏసీ, కిటికీలు లేని గదులు, ఫ్లోరోసెంట్ లైట్లు మన చర్మం, జుట్టుపై చూపే ప్రభావాన్ని ఈ థియరీ వివరిస్తుంది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు గ్లోయింగ్‌గా ఉండే చర్మం, ఆఫీసు గాలి తగలగానే ఎందుకు డల్‌గా మారుతుందో నెటిజన్లు వీడియోల రూపంలో చూపిస్తున్నారు. ఎయిర్ కండిషనింగ్, సెంట్రలైజ్డ్ వెంటిలేషన్ సిస్టమ్స్ ఉన్న ఆఫీస్ బిల్డింగ్స్‌లో పనిచేసే వాళ్లు చర్మం, జుట్టు సమస్యల బారినపడుతున్నట్లు తమ అనుభవాన్ని పంచుకుంటున్నారు. ముఖ్యంగా డ్రై స్కిన్, డల్‌నెస్, ఆయిలీ స్కాల్ప్, హెయిర్ ఫాల్ లాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ వాపోతున్నారు.
‘ఎయిర్ కండిషన్డ్ ఎన్విరాన్మెంట్లో తేమ శాతం చాలా తక్కువగా ఉంటుంది. మన చర్మం ఆరోగ్యకరంగా ఉండాలంటే 40 నుంచి 60 శాతం తేమ తప్పనిసరి. కానీ, ఏసీ ఆఫీసుల్లో ఇది 20 నుంచి 30 శాతానికి మించడం లేదు. దీంతో డ్రైనెస్, ఇరిటేషన్, ప్రీమెచ్యూర్ ఏజింగ్ లాంటి సమస్యలు వస్తున్నాయి. జుట్టు విషయంలోనూ ఇదే పరిస్థితి.. స్కాల్ప్ డ్రై అయినప్పుడు, అది ఓవర్ కంపెన్సేట్ చేయడానికి ఎక్కువ సెబమ్ (జట్టును తేమగా, మృదువుగా ఉంచడానికి అవసరమైన సహజ నూనె) ప్రొడ్యూస్ చేస్తుంది.. అందుకే జుట్టు ఆయిలీగా మారుతుంది’ అని డెర్మటాలజిస్ట్ లు చెబుతున్నారు. అంతేకాదు.. ఆఫీసు వాతావరణం మన చర్మంపై ఉండే సహజసిద్ధమైన రక్షణ పొరను బలహీనపరుస్తుంది. గాలిలో తేమ తక్కువగా ఉండటం వల్ల చర్మం నీటిని కోల్పోయి.. ముడతలు పడటం, మొటిమలు వచ్చే అవకాశం ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు.
జుట్టుని ఎలా ప్రభావితం చేస్తుంది?
ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకుంటే.. ఈ సమస్య మరింత క్లియర్‌గా అర్థమవుతుంది. ఏసీ యూనిట్స్ లోపలి గాలిని తీసుకుని, దాని నుంచి తేమని తీసేసి, చల్లటి గాలిని బయటికి పంపుతాయి. ఈ ప్రాసెస్‌లో గాలిలోని ఆర్ద్రత తగ్గిపోతుంది. ఫలితంగా, మన చర్మం, జుట్టు నుంచి కూడా తేమ ఆవిరైపోతుంది. ముఖ్యంగా కళ్ల చుట్టూ, పెదవుల చుట్టూ, చేతుల మీద డ్రైనెస్ ఎక్కువగా కనిపిస్తుంది. చర్మం టైట్‌గా అనిపించడం, దురద, ఎరుపు, స్కేలింగ్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. జుట్టు విషయంలో, స్కాల్ప్ డ్రై అయ్యి చుండ్రు పెరుగుతుంది. జుట్టు పొడిబారుతుంది. హెయిర్ రూట్స్ వద్ద ఆయిల్‌నెస్ పెరగడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ చర్మం, జుట్టు సమస్యలు మెంటల్ వెల్‌బీయింగ్‌పై కూడా ప్రభావం చూపుతాయి. ఆఫీస్‌లో కాన్ఫిడెన్స్ తగ్గడం, సెల్ఫ్-ఎస్టీమ్ ఇష్యూస్, సోషల్ యాంగ్జయిటీ పెరగడం లాంటివి జరగవచ్చు.
ఇలా చెక్ పెట్టండి!