ఇప్పటిదాకా పుస్తకాలను చదివి తలలో జ్ఞాపకం పెట్టుకోవడమే మనకు తెలుసు. కానీ పుస్తకాల వరుసలని తల అలంకారంగా మార్చేస్తున్నారు నేటి ఫ్యాషనిష్టులు. హెయిర్ స్టయిలింగ్ విషయంలో అమ్మాయిలు ఎక్కువగా వాడే క్లచ్లను ఈ తరహాలో రూపొందిస్తున్నారు. చిన్నా పెద్దా సైజులోని రంగురంగుల పుస్తకాలు ఒక వరుసలో పేర్చినట్టు కనిపించేలా ఈ క్లిప్పులను తయారు చేస్తున్నారు. బుక్ హెయిర్ క్లా క్లిప్ పేరిట ఆన్లైన్లో ఇవి దొరుకుతున్నాయి. చూడగానే విభిన్నంగా అనిపించేలా, ఫ్యాషన్ స్టేట్మెంట్లా కనిపించేలా ఉండే వీటి పట్ల అమ్మాయిలు బాగా క్రేజ్ చూపిస్తున్నారు. ట్రెండీ డ్రెస్ల మీదకి చక్కగా సూట్ అయ్యే ఇవి చూడగానే ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. మరి మీకెలా అన్పిస్తున్నాయ్?!