ఉద్యోగుల్లో ఊబకాయం
భారతీయ ఉద్యోగులు ఊబకాయం బారిన పడుతున్నారు. ప్రతి పదిలో ఎనిమిది మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. వీరిలో చాలామంది ఇప్పటికే మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలతో సతమతం అవుతున్నారు.
భారతీయ ఉద్యోగులు ఊబకాయం బారిన పడుతున్నారు. ప్రతి పదిలో ఎనిమిది మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. వీరిలో చాలామంది ఇప్పటికే మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలతో సతమతం అవుతున్నారు. తాజాగా, నిర్వహించిన ఓ సర్వే.. ఈ విషయాన్ని బయటపెట్టింది. ఈ అనారోగ్యాలలో చాలావరకు ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలను చూపించవు. దాంతో, తీవ్రమయ్యే వరకూ బాధితులు వాటిని విస్మరిస్తున్నారని సదరు సర్వే గుర్తించింది. ఇందుకుగల కారణాలను వివరిస్తూ.. గత కొద్దికాలంగా మనుషుల్లో శారీరక శ్రమ తగ్గిపోయింది. దీనికితోడు ప్రాసెస్ చేసిన ఆహారం, అధిక షుగర్, కార్బొహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతున్నది. వీటన్నిటికీ మించి.. చాలామంది బరువు పెరగడాన్ని అనారోగ్య సమస్యగా భావించడం లేదు. వయసుతోపాటు వచ్చే సహజ మార్పుగానే భావిస్తున్నారు.
ఫలితంగా, లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. నిజానికి అధిక బరువు అనేది రూపానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. అనేక దీర్ఘకాలిక వ్యాధులకు మూలం ఇదే. మధుమేహం రావడానికి ప్రధాన కారణం కూడా అధిక బరువే! శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్నారు. శరీరం మోయగలిగే దానికంటే ఎక్కువ బరువు ఉండటం వల్ల మోకాళ్లపై ఒత్తిడి పడి త్వరగా అరిగిపోతున్నాయి. అయితే, ఈ పరిస్థితిని మార్చడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని అధ్యయనకారులు అంటున్నారు. చిన్నపాటి క్రమశిక్షణతో పెద్ద సమస్య నుంచి బయట పడొచ్చని చెబుతున్నారు. రోజుకు కనీసం 30-40 నిమిషాల పాటు వేగవంతమైన నడక, రాత్రి భోజనం త్వరగా చేయడం, కార్బోహైడ్రేట్లు తగ్గించి ప్రొటీన్, ఫైబర్ పెంచడం, ఒత్తిడిని తగ్గించుకోవడం లాంటివి
అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. బరువును ఒక అంకెలా కాకుండా.. భవిష్యత్తు ఆరోగ్యానికి సూచికగా చూడాలని సలహా ఇస్తున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

