ఆలోచన మంచిదే. కానీ, మితిమీరిన ఆలోచనలు మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తాయి. ఎంతలా అంటే ఒక్కోసారి పక్షవాతం రావచ్చు, ఇతర అవయవాలు సైతం పూర్తిగా దెబ్బతినవచ్చు.. ఆత్మహత్య ప్రయత్నానికి దారితీయవచ్చు. అందుకే ‘అతి ఎప్పుడూ అనర్థమే’ అన్నారు పెద్దలు. ఏదైనా సమస్య గురించి ఆలోచన మంచిదే.. ఓ పెను సంక్షోభం నుంచి కుటుంబాన్ని కాపాడుకోవాలన్న తపనా మంచిదే. అయితే ఆలోచన వెనువెంటనే కార్యాచరణ ఉండాలి. అలా కాకుండా, నిత్యం ఆలోచిస్తూ కూర్చుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు మనస్తత్వ వైద్యులు. గతం గురించి చింతిస్తూ.. వర్తమానం గురించి బాధపడుతూ.. రేయింబవళ్లూ అర్థంలేని ఆలోచనల్లో మునిగితేలుతుంటే మీరు కచ్చితంగా మానసిక జాడ్యాన్ని ఎదుర్కొంటున్నట్టే. ఈ సమస్యనుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు ..