Water | ఆరోగ్యానికే కాదు.. అందాన్ని కాపాడటంలోనూ నీళ్లు (Water) కీలకంగా వ్యవహరిస్తాయి. శరీరంలో తగినంత నీరు ఉన్నప్పుడే.. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే, వేసవిలో మాదిరిగా.. వర్షాకాలంలో ఎక్కువగా దాహం వేయదు. కాబట్టి, నీళ్లు తక్కువగా తాగుతుంటారు. దాంతో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఇది చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా.. నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం కొన్ని ఆహార నియమాలను పాటించాలని సూచిస్తున్నారు.