స్మార్ట్‌ఫోన్‌లో ఎన్ని ఫీచర్లు ఉన్నా, వీడియో గేమ్స్ ఆడాలంటే.. గేమింగ్ కన్సోల్ ఉండాల్సిందే! ఆ జాయ్ స్టిక్స్, ప్రత్యేకమైన బటన్స్‌తో గేమ్స్ ఆడుతుంటే వచ్చే ఫీలింగే వేరు! అలాంటి గేమింగ్ లవర్స్ కోసం మరో సరికొత్త కన్సోల్ వచ్చేసింది. ‘నింటెండో’ సంస్థ నుంచి ‘స్విచ్ 2’ ఇటీవలే మార్కెట్లోకి విడుదలైంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో అమ్ముడైన ‘నింటెండో స్విచ్ 1’కు అప్డేట్ వెర్షన్‌గానే ఈ ‘స్విచ్ 2’ రూపొందింది.
స్విచ్ 2 ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 8 అంగుళాల ఇంటర్నల్ స్క్రీన్‌ను ఏర్పాటుచేశారు. 1080పి డిస్ప్లే, 120 ఎఫ్‌పీఎస్ వరకు ఫ్రేమ్ రేట్లతో గేమర్లకు అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. స్విచ్ 1తో పోలిస్తే.. ఇది మరింత శక్తిమంతమైనది. ఇందులో ఏఐ ప్రాసెసింగ్‌కు మద్దతు ఇచ్చే Nvidia అభివృద్ధి చేసిన ఆధునిక ప్రాసెసర్‌ను వాడారు.
డాక్ అనుకూల టీవీలలో 4కె రిజల్యూషన్ వరకూ సపోర్ట్ చేస్తుంది. ఈ కన్సోల్‌లోని జాయ్-కాన్ కంట్రోలర్లను స్క్రీన్ నుంచి విడదీయొచ్చు. వాటిని టేబుల్‌పై ఉంచి.. కంప్యూటర్ మౌస్ లాగా వాడుకోవచ్చు. ఇందుకోసం వీటిలో ‘ఇన్‌బిల్ట్ ఆప్టికల్ సెన్సార్’ను ఏర్పాటుచేశారు. అనేక ఫీచర్లతో వస్తున్న ఈ కన్సోల్.. గేమింగ్ లవర్స్‌కి సరికొత్త అనుభూతిని అందిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.