ఎక్కడికి వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి? ఎలా వెళ్లాలి? ఈ ప్రశ్నల కన్నా.. ఇప్పుడు ‘ఎవరితో వెళ్లాలి?’ అన్నదే చాలా ఇంపార్టెంట్‌గా మారిపోయింది. రొటీన్ టూర్లు ఫ్రెండ్స్తోనో, పార్ట్నర్తోనో, ఫ్యామిలీతోనో సాగిపోతుంటాయి. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారిపోతున్నది బాస్.. ఇప్పుడో కొత్త కాంబినేషన్ సెట్ అవుతున్నది. అదే ‘ఫ్రోలీగ్స్’తో టూర్స్!! ఎవరీ ‘ఫ్రోలీగ్స్’ అనుకుంటున్నారా? వీళ్లు ఫారినర్స్ కాదు, ఐపీఎల్ చీర్‌గర్ల్స్ అంతకన్నా కాదు. ఫ్రెండ్స్‌లా ఫీల్ అయ్యే కొలీగ్స్. వీళ్లనే నేటి జెన్-జీ బ్యాచ్ అంతా ‘ఫ్రోలీగ్స్’ అని పిలుచుకుంటున్నారు!! ఇప్పుడు వీళ్లతో ట్రావెల్ ప్లాన్స్ ట్రెండింగ్‌గా నిలుస్తున్నాయి.
ఆఫీస్‌లో కాఫీ టేబుల్ కబుర్లు.. అక్కడినుంచి అలా వీకెండ్ వెకేషన్‌కి వెళ్తున్నాయి. అంతేనా.. లాంగ్ జర్నీ టూర్స్‌కి కూడా ప్రణాళికలు పడుతున్నాయి. ఇది ఎంతవరకూ వచ్చిందంటే.. వర్క్ వైవ్స్, వర్క్ హస్బెండ్స్ విడివిడిగా ప్లాన్ చేస్తున్నారట. అంటే.. నేటి కార్పొరేట్ ఆఫీస్‌లో పనిచేసే ఆడవాళ్లంతా కలిసి ట్రిప్స్‌కి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారట. పురుషులూ మేం కూడా ఎక్కడా తగ్గేదే లేదంటూ బెస్ట్ ఫ్రోలీగ్స్గా యాత్రలకు వెళ్తున్నారు. స్త్రీ, పురుషులు కలివిడిగానూ విహారానికి సై అంటున్నారు. ఇంకేముందీ.. ఆఫీస్ క్యూబికల్లో పడే జోక్స్ ఏకంగా ట్రెక్కింగ్, బీచ్ ట్రిప్స్‌లో పేలుతున్నాయి. ట్రావెల్ అంటే ఒకప్పుడు ఫ్రెండ్స్‌తో వెళ్లడం.. బీచ్‌లు, కొండలు చూసి రావడం పాత స్టయిల్‌గా మారిపోయింది. ఎక్కువగా ట్రావెల్ చేయడం, ఎక్కువ ఖర్చు చేయడం, మినీ వెకేషన్స్తోపాటు లాంగ్ లగ్జరీ ట్రిప్స్‌కు వెళ్లడం.. అదీ ఫ్రోలీగ్స్తో ఫాలో అవుతున్న ట్రెండ్. ఒక సర్వే ప్రకారం ఎక్కువ శాతం మంది ‘ఫ్రోలీగ్స్’తో ట్రావెల్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆఫీస్‌లో కాఫీ బ్రేక్ తీసుకునే బెస్టీ ఇప్పుడు ట్రెక్కింగ్ పార్ట్నర్ అవుతున్నారు.. ఇది 2025 ట్రావెల్ మాయ!
నేటి తరం ఏం చేసినా.. కెరీర్ ఫోకస్‌గా ప్లాన్ చేస్తున్నది. తక్కువ వయసులోనే ఉన్నత శిఖరాల్ని అందుకునేందుకు కష్టపడుతున్నది. అందుకేనేమో ప్రోగ్రెసివ్‌గా ఈ ఫ్రోలీగ్స్ ట్రెండ్ ముందుకొస్తున్నది. ఇంటినుంచి తెచ్చుకున్న లంచ్ బాక్స్ దగ్గర్నుంచి కెఫెటేరియాలో కాఫీ వరకూ అన్నీ ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆఫీస్ బెస్టీలు, వర్క్ వైవ్స్ (భార్యలు), వర్క్ హస్బెండ్స్ (భర్తలు) లాంటి వాళ్లపై థామస్ కుక్ ఓ సర్వే చేసింది. దీంట్లో 2,500 మంది పాల్గొన్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా కూడా డేటా కలెక్ట్ చేశారు. ఈ సర్వే ప్రకారం.. దేశంలో ట్రావెల్ ట్రెండ్స్ మారుతున్నాయి. ఫ్యామిలీ కల్చర్స్, వర్క్ కల్చర్స్ ఆధారంగా సరికొత్త ట్రావెల్ ఫ్రెండ్స్ పుట్టుకొస్తున్నారు. ఇక భారతీయ పర్యాటకులు ట్రెడిషనల్ సైట్‌సీయింగ్ కంటే ఎమోషనల్, ఎక్స్‌పీరియెన్షియల్ ట్రావెల్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని థామస్ కుక్ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.
విహార యాత్రలంటే.. చక్కగా రెడీ అవ్వడం.. ఏ బస్సు విండో నుంచో.. హోటల్ గది కిటికీ నుంచో.. ప్రకృతిని చూస్తూ కూర్చోవడం నేటి తరం ఇష్టపడటం లేదు. నేటి జెన్-జీ బ్యాచ్ అంతా ‘ఎక్స్‌పీరియెన్షియల్ ట్రావెల్’నే ఇష్టపడుతున్నారు. 2025లో ఈ ఎక్స్‌పీరియెన్షియల్ ట్రావెల్ డిమాండ్ 75 శాతానికి చేరింది. అంటే, సాధారణ టూరిస్ట్ స్పాట్స్ కంటే ప్రత్యేక అనుభవాలు, ఈవెంట్-బేస్డ్ ట్రావెల్‌కు ఇంపార్టెన్స్ పెరిగింది. అంటే.. ఎప్పుడూ చూడని వాటిని సాహసం చేసైనా చూడటం.. ట్రెక్కింగ్ చేయడం.. లాంటివి అన్నమాట.
నేటి డిజిటల్ ఎరాలో సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, ఏఐ ట్రావెల్ ప్లానింగ్‌కు కీలకంగా మారాయి. ఓ సర్వే ప్రకారం.. 60% మంది యూత్ సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, మూవీస్ చూసి ట్రావెల్ డెస్టినేషన్స్ సెలెక్ట్ చేస్తున్నారట. ఎందుకంటే.. ఇప్పుడు ప్రపంచ సినిమా మొత్తం ఓటీటీలపైకి వచ్చేసింది. దీంతో ఆయా సినిమాల్లోని లొకేషన్స్, కల్చర్స్, ఆహారపు అలవాట్లు కొత్త ప్రాంతాల్ని ఎక్స్ప్లోర్ చేసేందుకు సోర్స్ అవుతున్నాయి. ఏ చిన్న టైమ్ గ్యాప్ దొరికినా ట్రావెల్ చేసేందుకు మక్కువ చూపుతున్నారు. అంతేకాదు.. 84% మంది ఖర్చుకు వెనకాడేదే లేదని చెబుతున్నారట. మరో వైపు మినీ వెకేషన్స్, లాంగ్ ట్రిప్స్ రెండూ ట్రెండ్ అవుతున్నాయి. లాంగ్ వీకెండ్స్, పబ్లిక్ హాలిడేస్‌ను వాడుకుని రిలాక్స్ అవ్వాలని చూస్తున్నారు.
ఎవరైనా టూర్లకు ఎందుకు వెళ్తారు.. అక్కడున్న విశేషాల్ని ఎక్స్ప్లోర్ చేయడానికే కదా. కానీ, మీకు తెలుసా? బోలెడన్ని డబ్బులు ఖర్చుపెట్టి.. వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి.. లగ్జరీ హోటల్ రూమ్‌లు తీసుకుని.. సింపుల్‌గా ఏమీ చేయకుండా ఆ గదుల్లోనే గంటల తరబడి నిద్రపోతారు. ఇప్పుడు ఇదో నయా ట్రావెల్ ట్రెండ్. ఫ్రోలీగ్స్ ఫాలో అవుతున్న నయా జీవన విధానం ఇది. దీనికో పేరు కూడా ఉంది. ‘హర్కుల్ డర్క్లింగ్’ (Hurkle Durkling). ఇది ఓ స్కాటిష్ పదం నుంచి పుట్టింది. దీని అర్థం ఏంటంటే.. ఏమీ చేయకుండా మంచంపై గంటలు కొద్దీ పడుకుని, కూర్చుని రిలాక్స్ అవ్వడం. అంటే ఎక్కడికైనా టూరిస్ట్ స్పాట్‌కి వెళ్తారు.. అక్కడే గదిలోనే ఉంటారు. స్లీప్ థెరపీస్, మసాజ్, స్పా ట్రీట్మెంట్స్తో మానసికంగా రిలాక్స్ అవుతారు. ఫ్రోలీగ్స్ దృష్టిలో ఇది టూర్ కాదు. ఇదో ‘రీచార్జ్’ అన్నమాట. స్ట్రెస్ఫుల్ జీవనం నుంచి తీసుకునే బ్రేక్. ఒక రిపోర్ట్ ప్రకారం.. ప్రతి ఐదుగురిలో ఒకరు ఈ రకమైన టూర్ కోసం చూస్తున్నారట.
నేటి తరం రోజులో ఎక్కువ సమయం ఆఫీస్‌లో, కొలీగ్స్తోనే గడిపేయడం చూస్తున్నాం. ఫ్యామిలీ, బెస్డ్ బడ్డీస్ కంటే కూడా! అందుకే సహజంగానే మన కొలీగ్స్‌తో ఒక బాండ్ క్రియేట్ అవుతుంది. ఫ్రెండ్షిప్ను పెంచుతుంది. అందుకే వీరిని ‘ఫ్రోలీగ్స్’ అని పిలుచుకుంటూ ఆఫీస్ టైమ్ దాటి.. హ్యాంగ్ అవుట్ చేయడం.. షార్ట్ ట్రిప్స్‌కు వెళ్లడం లాంటివి చేస్తున్నారు. ‘ఫ్రోలీగ్స్’తో ట్రిప్స్ అంటే అన్నీ స్మూత్‌గా ఉంటాయని కాదు.. కొన్ని చాలెంజెస్ కూడా ఉంటాయి. వర్క్ బడ్డీస్తో ట్రావెల్ చేస్తుంటే వర్క్ టాపిక్స్ నుంచి డిస్కనెక్ట్ అవ్వడం కష్టం! ఇది కొన్నిసార్లు ఇబ్బందికరంగా మారొచ్చు. అందుకే ఈ టూర్లో జాయ్‌నెస్ తగ్గకూడదు అనుకుంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..