ఎంతటి అందగత్తెకు అయినా గర్భం దాల్చాక శారీరక మార్పులు తప్పవు. ‘అమ్మా’ అన్న పిలుపు కోసం కాబోయే తల్లి ఎంత తీవ్రమైన మార్పును అయినా సంతోషంగా స్వీకరిస్తుంది. తాజాగా నటి కాజల్ అగర్వాల్ ఆ మార్పుతో ముడిపడిన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నది. ఇటీవల కాజల్ ‘బేబీ బంప్’తో బీచ్‌లో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దాంతో కొంతమంది నెటిజన్లు ఆమెలోని మార్పుల గురించి కామెంట్లు చేశారు. ఆ వ్యాఖ్యలపై కాజల్ కూల్‌గా స్పందించింది. ‘ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరగడం సహజం. కాన్పు తర్వాత మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తారు కూడా. రాకపోయినా ఫర్వాలేదు. అందం కంటే అమ్మతనమే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది’ అన్న అర్థం వచ్చేలా కాజల్ సమాధానం ఇచ్చింది.